KTR letter: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ..కేంద్రానికి కేటీఆర్ లేఖ

ABN , First Publish Date - 2023-04-02T12:46:58+05:30 IST

కేంద్ర ప్రభుత్వానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(IT Minister KTR) లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ

KTR letter: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ..కేంద్రానికి కేటీఆర్ లేఖ

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (IT Minister KTR) లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను (Privatization of Visakha Steel Plant) ఆపాలంటూ లేఖలో పేర్కొన్నారు. కేటీఆర్(KTR) లేఖలో.. ‘‘ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలి. కార్పొరేట్(Corporate) మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానాలి. వర్కింగ్ క్యాపిటల్ (Working capital), నిధుల సమీకరణ పేరుతో.. ప్లాంట్‌ను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్ర చేస్తున్నారు. కార్పొరేట్ మిత్రుల కోసం రూ.12.5 లక్షల కోట్లు మాఫీ చేశారు. అదే ఔదార్యం విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఎందుకు లేదు. కేంద్రమే వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆర్థికసాయం చేయాలి. విశాఖ ప్లాంట్(Visakha Plant) నుంచి స్టీల్ ఉత్పత్తులు కొనాలి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(Steel Authority of India) విస్తరణ ప్రణాళికల్లో..విశాఖ స్టీల్ ప్లాంట్‌ విలీనాన్ని పరిశీలించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వెంటనే రూ.5వేల కోట్లు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీఆర్ఎస్(BRS) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలకు వ్యతిరేకంగా..పోరాటానికి PSU కార్మికులు కలిసి రావాలి’’ అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.

కాగా, ‘‘కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన మేరకు కనీసం ఐదువేల కోట్ల రూపాయలను వేంటనే కేటాయించాలన్నారు. గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పేయి(PV Narasimha Rao, Atal Bihari Vajpayee) ప్రధానులుగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చింది. లక్షన్నర కోట్ల రూపాయల విలువ కలిగిన స్టీల్ ప్లాంట్‎ను అప్పనంగా ప్రైవేట్ పరం చేసే కుట్రలను కేంద్రం ఆపాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విడుదల చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‎లో చేసుకోబోయే ఒప్పందం విషయంలో ఎలాంటి నిర్దిష్ట నిబంధనలు లేవు. ఇది ముడి సరుకులకు మూలధనం పేరిట స్టీల్ ప్లాంట్‎ని తమ అనుకూల ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్ర చేస్తోంది. వైజాగ్ ఉక్కు తెలుగు వారి హక్కు… దీని కాపాడుకోవడం తెలుగువారి బాధ్యత. భారత రాష్ట్ర సమితి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు సంఘీభావం తెలపాలని ఆంధ్రప్రదేశ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్‎కి మంత్రి కేటీఆర్ సూచించారు.

Updated Date - 2023-04-02T13:10:05+05:30 IST