Share News

TS NEWS:ఫెడెక్స్ కొరియర్ పేరుతో మహిళని మోసగించిన సైబర్ నేరగాడు అరెస్ట్

ABN , Publish Date - Dec 25 , 2023 | 08:52 PM

ఫెడెక్స్ కొరియర్ ( FedEx courier ) పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ మహిళని ఉత్తర్ ప్రదేశ్‌ ( Uttar Pradesh ) రాష్ట్రంలోని ఆలీఘర్‌కి చెందిన హర్ష్‌ కుమార్‌ మోసగించడంతో పోలీసులు యూపీకి వెళ్లి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మీ చిరునామా, ఆధార్ వివరాలతో ముంబై నుంచి తైవాన్‌కు అనుమానిత వస్తువులను పంపుతున్నారని తార్నాకాకు చెందిన బాధితురాలికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేశారు.

TS NEWS:ఫెడెక్స్ కొరియర్ పేరుతో మహిళని మోసగించిన సైబర్ నేరగాడు అరెస్ట్

హైదరాబాద్: ఫెడెక్స్ కొరియర్ ( FedEx courier ) పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ మహిళని ఉత్తర్ ప్రదేశ్‌ ( Uttar Pradesh ) రాష్ట్రంలోని ఆలీఘర్‌కి చెందిన హర్ష్‌ కుమార్‌ మోసగించడంతో పోలీసులు యూపీకి వెళ్లి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మీ చిరునామా, ఆధార్ వివరాలతో ముంబై నుంచి తైవాన్‌కు అనుమానిత వస్తువులను పంపుతున్నారని తార్నాకాకు చెందిన బాధితురాలికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేశారు. తనకు సంబంధం లేదని సహాయం చేయాలని నిందితులను బాధిత మహిళ కోరింది. ఆమెపై కేసు నమోదు కాకుండా ఉండాలంటే ఆరు లక్షలు కట్టాలని నేరగాళ్లు బాధిత మహిళని బెదిరించారు. ఆమె భయంతో వెంటనే వారి ఖాతాకు నగదు బదిలీ చేసింది.

అనంతరం మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఉత్తర్ ప్రదేశ్‌లో ఉన్న నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకువచ్చారు. నిందితుడి నుంచి చరవాణి, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే చైనా దేశానికి చెందిన సైబర్ నేరగాళ్లతోనూ హర్ష్ కుమార్‌ సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి ఆదేశాలతో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఖాతాలను హర్ష్ కుమార్ తెరుస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - Dec 25 , 2023 | 09:01 PM