Bandi Sanjay: ‘మర్చిపోలేని మధుర జ్ఞాపకం’.. ఆర్ఆర్ఆర్‌కు బండి శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2023-03-13T10:58:21+05:30 IST

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడం మర్చిపోలేని మధుర జ్ఞాపకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.

Bandi Sanjay: ‘మర్చిపోలేని మధుర జ్ఞాపకం’.. ఆర్ఆర్ఆర్‌కు బండి శుభాకాంక్షలు

హైదరాబాద్: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా (RRS Movie)లోని ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ అవార్డు (Oscar Award) లభించడం మర్చిపోలేని మధుర జ్ఞాపకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (BJP State President, MP Bandi Sanjay Kumar) అన్నారు. విశ్వవేదికపై తొలిసారి భారతీయ సినిమా పాట (Indian Movie Song) కు ఆస్కార్ అవార్డు రావడం, అందులోనూ తెలుగు పాట ఆ ఘనత సాధించడం భారతీయులందరికీ ప్రత్యేకించి ప్రపంచంలోని తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. ఇంత గొప్ప పాటను రాసిన చంద్రబోస్ (Chandrabose), సంగీతం అందించిన ఎం.ఎం.కీరవాణి (MM Keeravani), స్వరాలందించిన రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sibligunj), కాలభైరవ (Kala Bhairava)తో పాటు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చిత్ర యూనిట్‌కు, ముఖ్యంగా తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి చేర్చిన రాజమౌళి (Rajamouli), జూనియర్ ఎన్టీఆర్ (Junion NTR), రామ్ చరణ్‌ (Ram Charan)కు బండి సంజయ్ శుభాకంక్షలు తెలియజేశారు.

కాగా.. లాస్‌ ఏంజిల్స్‌ (Los Angelesలో డాల్బీ థియేటర్‌ వేదికగా జరిగిన 95వ ఆస్కార్‌ వేడుక (95th Oscars Celebrations) లో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రేక్షకులను అలరించిన తెలుగు పాట ‘నాటు నాటు...’ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా అకాడమీ అవార్డును సొంతం చేసుకుని అంతర్జాతీయ వేదికపై తెలుగువాడి సత్తాచాటింది. అకాడమీ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చరిత్ర సృష్టించింది.

Updated Date - 2023-03-13T15:32:58+05:30 IST