Share News

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ నోట పదే పదే ఎన్టీఆర్ నామం

ABN , First Publish Date - 2023-11-20T13:59:46+05:30 IST

Telangana Elections: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతీనియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తూ బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరుతున్నారు. నేడు మానుకొండూరులో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మనకొండూరు సభలో ముఖ్యమంత్రి పదే పదే ఎన్టీఆర్ పేరును ఉచ్చరించారు.

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ నోట పదే పదే ఎన్టీఆర్ నామం

కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభ‌ల్లో పాల్గొంటూ బీఆర్‌ఎస్‌కు (BRS) ఓటు వేయాలని కోరుతున్నారు. నేడు (సోమవారం) మానకొండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.

మనకొండూరు సభలో సీఎం కేసీఆర్ పదేపదే ఎన్టీఆర్ (NTR) పేరును ఉచ్చరించారు. ఇందిరమ్మ (Indira Gandhi) రాజ్యంలో అన్నమే లేదని, ఎన్‌టీ రామారావు పార్టీ పెట్టిందే పేదోళ్లకు అన్నం పెట్టడానికి అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ వచ్చాకే పేదోడికి కడుపు నిండా అన్నం దొరికిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో సక్కదనం లేదు కాబట్టే ఎన్టీఆర్ పార్టీ పెట్టారని తెలిపారు. ఎన్టీఆర్ తెచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం గొప్ప పథకం అని కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు జైలు పాలు అయ్యారన్నారు. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్సే (Congress) అని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం లో ఎమర్జెన్సీ వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-20T14:47:22+05:30 IST