Share News

CM Bhupesh Bhagel: బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్‌గా పనిచేస్తోంది

ABN , First Publish Date - 2023-11-26T17:02:35+05:30 IST

బీజేపీ ( BJP ) కి బీఆర్ఎస్ ( BRS ) బీ టీమ్‌గా పనిచేస్తుందని చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్ ( CM Bhupesh Bhagel ) వ్యాఖ్యానించారు.

CM Bhupesh Bhagel:  బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్‌గా పనిచేస్తోంది

హనుమకొండ : బీజేపీ ( BJP ) కి బీఆర్ఎస్ ( BRS ) బీ టీమ్‌గా పనిచేస్తుందని చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్ ( CM Bhupesh Bhagel ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు కాజీపేటలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ నిర్వహించింది. ఈ సభకు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్ హాజరయ్యారు. వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపేష్ భగేల్ మాట్లాడుతూ...‘ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారు. పేదల అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తానని ప్రధాని మోదీ అన్నారు...కానీ ఇవ్వలేదు మాట తప్పారు. మోదీ హామీలకు ఎలాంటి గ్యారంటీ లేదు. పదేళ్లుగా మోదీ ప్రజలను మోసం చేస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ చత్తీస్‌గఢ్‌లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నాం. కాంగ్రెస్ మాట ఇచ్చింది అంటే నెరవేర్చి తీరుతుంది. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేస్తాం. వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలి’’ అని సీఎం భూపేష్ భగేల్ పిలుపునిచ్చారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-26T17:11:05+05:30 IST