Share News

World Cup: గంగూలీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టి సచిన్ సరసన చేరిన రోహిత్ శర్మ.. మొత్తంగా 7 రికార్డులు ఫట్

ABN , First Publish Date - 2023-11-13T08:10:46+05:30 IST

Rohit sharma Records: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలో టీమిండియా దుమ్ములేపింది. ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ గెలిచి లీగ్ దశలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టుగా నిలిచింది. దీంతో 18 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచిన రోహిత్ సేన సెమీస్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది. ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా 160 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

World Cup: గంగూలీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టి సచిన్ సరసన చేరిన రోహిత్ శర్మ.. మొత్తంగా 7 రికార్డులు ఫట్

బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలో టీమిండియా దుమ్ములేపింది. ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ గెలిచి లీగ్ దశలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టుగా నిలిచింది. దీంతో 18 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచిన రోహిత్ సేన సెమీస్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది. ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా 160 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ప్రపంచకప్ చరిత్రలోనే తమ రెండో అత్యధిక స్కోర్ 410/4ను సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు భారత బ్యాటర్లు 50+స్కోర్లు చేయడం విశేషం. ఆ తర్వాత నెదర్లాండ్స్ 250 పరుగులకే ఆలౌటైంది. ఈ ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌లో, కెప్టెన్సీలో ఆకట్టుకుంటున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. 8 ఫోర్లు, 2 సిక్సులతో 54 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ 7 రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.


1- ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 503 పరుగులు చేశాడు. దీంతో ఒక వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 2003 ప్రపంచకప్‌లో 465 పరుగులు చేసిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు.

3- వన్డే ప్రపంచకప్ చరిత్రలో రోహిత్‌కు ఇది 13వ 50+ స్కోర్. దీంతో ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్‌తో కలిసి మూడో స్థానంలో ఉన్నాడు. 21 సార్లు 50+ స్కోర్లు చేసిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.

1- వన్డే ప్రపంచకప్ చరిత్రలో రోహిత్‌కు ఇది రెండో 500+ స్కోర్. దీంతో రెండు ఎడిషన్‌లో 500+ పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి మొదటి స్థానంలో ఉన్నాడు. సచిన్ 1996, 2003 ఎడిషన్‌లలో 500+ పరుగులు సాధించారు. కాగా రోహిత్ గత 2019 ప్రపంచకప్‌లో ఈ ప్రపంచకప్‌లో 500+ పరుగులు సాధించాడు. అలాగే వన్డే ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండు ఎడిషన్‌లో 500+ పరుగులు సాధించిన ఒకే ఒక్కడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.

1-ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 24 సిక్సులు కొట్టాడు. దీంతో ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 2019లో 22 సిక్సులు కొట్టిన ఇయాన్ మోర్గాన్ రికార్డును అధిగమించాడు.

1- ఈ ఏడాది వన్డేల్లో రోహిత్ 60 సిక్సులు కొట్టాడు. దీంతో వన్డే ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 2015లో 58 సిక్సులు కొట్టిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్ రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేశాడు.

14049- అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా రోహిత్ శర్మ 14 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.

104- వన్డేల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ 100 ఫోర్లను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు 104 ఫోర్లు బాదాడు.

Updated Date - 2023-11-13T08:57:54+05:30 IST