Share News

World Cup: బుమ్ బుమ్ బుమ్రా.. ఈ వరల్డ్ కప్‌లో బుమ్రానే టాప్.. ఎందులో అంటే..?

ABN , First Publish Date - 2023-10-26T14:39:44+05:30 IST

టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సత్తా చాటుతున్నాడు. ప్రత్యర్థులకు పరుగులు రాకుండా కట్టడి చేయడంతోపాటు కీలక సమయాల్లో వికెట్లు తీసి సత్తా చాటుతున్నాడు.

World Cup: బుమ్ బుమ్ బుమ్రా.. ఈ వరల్డ్ కప్‌లో బుమ్రానే టాప్.. ఎందులో అంటే..?

టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సత్తా చాటుతున్నాడు. ప్రత్యర్థులకు పరుగులు రాకుండా కట్టడి చేయడంతోపాటు కీలక సమయాల్లో వికెట్లు తీసి సత్తా చాటుతున్నాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో పరుగులు రాకుండా కట్టడి చేస్తున్నాడు. దీంతో టీమిండియా ప్రత్యర్థులు పవర్ ప్లేలో పరుగులు చేయడానికి అపసోపాలు పడుతున్నారు. మిడిల్ ఓవర్లలోనూ భాగస్వామ్యాలను బ్రేక్ చేస్తున్నాడు. ఇక డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంటున్నాడు. ముఖ్యంగా వరుస డాట్ బాల్స్‌తో బ్యాటర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో పరుగులు చేయలేక ప్రత్యర్థి బ్యాటర్లు ఎక్కువగా డాట్ బాల్స్ ఆడుతున్నారు. ఈ క్రమంలో స్కోర్ మందగిస్తుంది. దీంతో వేగంగా ఆడే క్రమంలో ఇతర జట్ల బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. బుమ్రా ఇప్పటివరకు 188 డాట్ బాల్స్ వేశాడు. అలాగే ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో బుమ్రా 11 వికెట్లు కూడా పడగొట్టాడు. బుమ్రా తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. బౌల్ట్ ఇప్పటివరకు 165 డాట్ బాల్స్ వేశాడు. ఆ తర్వాతి స్థానాలో ఉన్న రవీంద్ర జడేజా 159 డాట్ బాల్స్, జోష్ హెజీల్‌వుడ్ 156 డాట్ బాల్స్, హసన్ అలీ 155 డాట్ బాల్స్, కుల్దీప్ యాదవ్ 154 డాట్ బాల్స్ వేశారు.


Updated Date - 2023-10-26T14:40:25+05:30 IST