Share News

Rohit Sharma: భగ్గుమంటున్న రోహిత్ శర్మ ఫ్యాన్స్.. ముంబై ఇండియన్స్ జెర్సీలు కాల్చివేత!

ABN , Publish Date - Dec 16 , 2023 | 01:59 PM

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించడం పెద్ద దుమారమే లేపింది. హిట్‌మ్యాన్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.

Rohit Sharma: భగ్గుమంటున్న రోహిత్ శర్మ ఫ్యాన్స్.. ముంబై ఇండియన్స్ జెర్సీలు కాల్చివేత!

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించడం పెద్ద దుమారమే లేపింది. హిట్‌మ్యాన్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. సోషల్ మీడియాలో, బయట హిట్‌మ్యాన్‌కు భారీగా మద్దతు లభిస్తోంది. సాధారణ క్రికెట్ అభిమానులతో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని అభిమానులు కూడా రోహిత్ శర్మకు మద్దతుగా నిలుస్తున్నారు. క్రికెట్ విశ్లేషకులు కూడా హిట్‌మ్యాన్ వైపే నిలుస్తున్నారు. 5 సార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్‌ పట్ల ముంబై ఇలా దారుణంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌కు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగించి 2025లో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇస్తే వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్ దృష్యానే కెప్టెన్సీ మార్పు చేశామని ముంబై మేనేజ్‌మెంట్ చెబుతున్నప్పటికీ విశ్లేషకులతోపాటు అభిమానులు ఏ మాత్రం సంతృప్తి చెందడం లేదు.


రోహిత్ శర్మకు మద్దతుగా ముంబై ఇండియన్స్‌కు వ్యతిరేక పోస్ట్‌లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. పలువురు అభిమానులైతే ముంబై ఇండియన్స్ జెర్సీలు, టోపీలను కాల్చి వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వైరల్ అయిన వీడియోల్లో చెట్టుకు వేలాడదీసిన ముంబై ఇండియన్స్ జెర్సీని ఓ అభిమాని కాల్చి వేశాడు. మరో వీడియోలో ముంబై ఇండియన్స్ టోపీలను అభిమానులు నేలపై వేసి తొక్కారు. చివరకు ఆ టోపీలను కాల్చివేశారు. దీనికి తోడు ఎక్స్‌లో షేమ్ఆన్ఎంఐ(ShameonMI) అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ ఖాతాను ఆన్‌ఫాలో చేస్తున్నారు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ దెబ్బతో ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఎక్స్‌లో 4 లక్షల మంది ఫాలోవర్లను, ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయింది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీల పరంగా ఉన్న మొదటి స్థానం కూడా పోయింది. ఇంతకాలం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను కల్గి ఉన్న ప్రాంచైజీల జాబితాలో ముంబై ఇండియన్స్ మొదటి స్థానంలో ఉన్నది. కానీ రోహిత్ శర్మ అభిమానులు భారీగా ఆన్‌ఫాలో కొట్టడంతో రెండో స్థానానికి పడిపోయింది. ఆ స్థానానికి చెన్నైసూపర్ కింగ్స్ చేరుకుంది.

Updated Date - Dec 16 , 2023 | 02:01 PM