Share News

INDW vs AUSW: ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌కు టీమిండియా ఉమెన్స్ జట్టు ఎంపిక

ABN , Publish Date - Dec 25 , 2023 | 02:41 PM

India vs Australia: ప్రస్తుతం భారత మహిళల జట్టు మంచి ఫామ్‌లో ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత జట్టు టెస్టు ఫార్మాట్‌లో వరుసగా బలమైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను ఓడించింది. ఇదే ఊపులో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల్లోనూ సత్తా చాటాలని మన అమ్మాయిలు భావిస్తున్నారు.

INDW vs AUSW: ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌కు టీమిండియా ఉమెన్స్ జట్టు  ఎంపిక

ప్రస్తుతం భారత మహిళల జట్టు మంచి ఫామ్‌లో ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత జట్టు టెస్టు ఫార్మాట్‌లో వరుసగా బలమైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను ఓడించింది. ఇదే ఊపులో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల్లోనూ సత్తా చాటాలని మన అమ్మాయిలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాతో జరిగే వైట్ బాల్ సిరీస్‌లకు సెలెక్టర్లు టీమిండియా జట్లను ఎంపిక చేశారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన బౌలర్ శ్రేయాంక పాటిల్‌కు తొలిసారి వన్డే జట్టులో చోటు కల్పించారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో శ్రేయాంక 5 వికెట్లు తీసి సత్తా చాటింది. చివరి మ్యాచ్‌లో అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సైకా ఇషాక్‌ కూడా ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపికైంది.


కాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన శ్రేయాంక, ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన ఇషాక్ సత్తా చాటారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అండర్ 19 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాలో సభ్యురాలైన యువ పేసర్ టైటాస్ సాధుకు కూడా ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 స్క్వాడ్స్‌ల్లో చోటు దక్కింది. కాగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో డిసెంబర్ 28, 30, జనవరి 2వ తేదీల్లో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జనవరి 5, 7, 9వ తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

టీమిండియా ఉమెన్స్ వన్డే జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, హర్లీన్ డియోల్

టీమిండియా ఉమెన్స్ టీ20 జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, కనికా అహుజా, మిన్ను మణి

Updated Date - Dec 25 , 2023 | 02:41 PM