Kohli Naatu Naatu: మైదానంలో కోహ్లీ ‘నాటునాటు’ స్టెప్!

ABN , First Publish Date - 2023-03-17T18:47:40+05:30 IST

‘నాటు నాటు’(Naatu Naatu).. ఇప్పుడీ పాట ప్రపంచాన్ని ఊపేస్తోంది. రాజమౌళి(Rajamouli)

Kohli Naatu Naatu: మైదానంలో కోహ్లీ ‘నాటునాటు’ స్టెప్!

ముంబై: ‘నాటు నాటు’(Naatu Naatu).. ఇప్పుడీ పాట ప్రపంచాన్ని ఊపేస్తోంది. రాజమౌళి(Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’(RRR) సినిమాలోని ఈ పాటకు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్(Oscar) పురస్కారం దక్కింది. దీంతో ఈ పాట క్రేజ్ మరింత పెరిగింది. ప్రతి ఒక్కరు ఈ పాటకు స్టెప్పులేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. టీమిండియా మాజీలు సునీల్ గవాస్కర్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ తదితరులు ఈ పాటకు ఉత్సాహంగా స్టెప్పులేశారు.

తాజాగా, ఈ ఖాతాలో టీమిండియా మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) చేరాడు. ఆస్ట్రేలియా(Australia)తో ముంబైలో జరుగుతున్న తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ పాటకు స్టెప్పు వేస్తూ కనిపించాడు. ఆర్ఆర్ఆర్ టీమ్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. సోషల్ మీడియాను ఇప్పుడీ వీడియో దున్నేస్తోంది.

సినిమాల్లోని పాటలకు కాలుకదపడం, డైలాగ్స్‌ను అనుకరించడం ఇదేమీ కొత్తకాదు. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’(Pushpa) సినిమాలోని ‘తగ్గేదేలే’ డైలాగ్ ఎంత పాపులర్ అయిందంటే.. చాలామందికి ఇది ఊతపదంగా మారిపోయింది. పలువురు క్రికెటర్లు కూడా దీనిని అనుకరిస్తూ మైదానంలో నవ్వులు పూయించారు. ఇప్పుడు ఆ స్థానంలో ‘నాటు నాటు’ పాట వచ్చి చేరింది.

ఇవి కూడా చదవండి

**************************

* Tim Paine: క్రికెట్‌కు ముగింపు పలికిన ఆసీస్ మాజీ కెప్టెన్

* RCB: ఐపీఎల్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్!

* Sunrisers Hyderabad: ఎస్ఆర్‌హెచ్‌కు కొత్త జెర్సీ.. ఆటగాళ్ల ఫొటోషూట్!

* WTC Final: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్.. దినేశ్ కార్తీక్ బోల్డ్ కామెంట్స్!

Updated Date - 2023-03-17T18:47:40+05:30 IST