Sunrisers Hyderabad: ఎస్ఆర్‌హెచ్‌కు కొత్త జెర్సీ.. ఆటగాళ్ల ఫొటోషూట్!

ABN , First Publish Date - 2023-03-16T16:34:07+05:30 IST

ఐపీఎల్ 2023కు సన్నద్ధమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) తాజగా

Sunrisers Hyderabad: ఎస్ఆర్‌హెచ్‌కు కొత్త జెర్సీ.. ఆటగాళ్ల ఫొటోషూట్!

హైదరాబాద్: ఐపీఎల్ 2023కు సన్నద్ధమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) తాజగా కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాకెక్కి సందడి చేస్తున్నాయి. కొత్త జెర్సీలు ధరించిన బ్యాటర్ మయాంక్ అగర్వాల్(Mayank Agarwal), పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్(Umran Malik), ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) ఫొటోలను ఎస్ఆర్‌హెచ్ తన అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఎస్ఆర్‌హెచ్(SRH) తన మొదటి మ్యాచ్‌ను ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals)తో హైదరాబాద్‌లో ఆడుతుంది.

గత సీజన్ హైదరాబాద్ జట్టుకు ఏమంత కలిసి రాలేదు. ఆరు విజయాలు, 8 పరాజయాలు, 12 పాయింట్లతో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ఫలితంగా ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇటీవల తమ జట్టు కెప్టెన్‌గా అయిడెన్ మార్కరమ్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది.

Untitled-14.jpg

ఎస్ఎ 20(SA 20) ప్రారంభ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ క్యాప్‌కు సారథ్యం వహించిన 28 ఏళ్ల దక్షిణాఫ్రికా స్టార్ జట్టుకు ట్రోఫీ అందించిపెట్టాడు. అంతేకాదు, ఆ లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో మూడో స్థానంలో నిలిచాడు. గత సీజన్‌లో హైదరాబాద్‌కు సారథ్యం వహించిన న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ పరుగులు సాధించడంలో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో గతేడాది డిసెంబరులో జరిగిన ఐపీఎల్ మినీ వేలానికి ముందు జట్టు అతడిని రిలీజ్ చేసింది. 2022 సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌లలో విలియమ్సన్ 216 పరుగులు మాత్రమే చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మొత్తం 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 8 మంది విదేశీ ప్లేయర్లు.

వేలంలో తీసుకున్నది వీరినే: హారీ బ్రూక్(రూ.13.25 కోట్లు), మయాంక్ అగర్వాల్ (రూ.8.25 కోట్లు), హెన్రిక్ క్లాసెన్ (రూ.5.25 కోట్లు), ఆదిల్ రషీద్ (రూ. 2 కోట్లు), మయాంక్ మార్కండే (రూ.50 లక్షలు), వివ్రాంత్ శర్మ (రూ.2.6 కోట్లు), సమ్రాట్ వ్యాస్ (రూ.20 లక్షలు), సన్వీర్ సింగ్ (రూ.20 లక్షలు), ఉపేంద్ర యాదవ్ (రూ. 25 లక్షలు), మయాంక్ డాగర్ (రూ. 1.8 కోట్లు), నితీశ్ కుమార్ రెడ్డి (రూ. 20 లక్షలు), అకీల్ హొసీన్ (రూ. కోటి), అన్మోల్‌ప్రీత్ సింగ్ (రూ.20 లక్షలు)

వీరిని రిటైన్ చేసుకున్నారు: అబ్దుల్ సమద్, అయిడెన్ మార్కరమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్‌హక్ ఫరూకీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.

Updated Date - 2023-03-16T16:47:46+05:30 IST