Share News

IND vs SA: 16 ఏళ్ల ధోని రికార్డును బద్దలుకొట్టిన సూర్యకుమార్ యాదవ్

ABN , First Publish Date - 2023-12-13T07:47:30+05:30 IST

Suryakumar yadav: సౌతాఫ్రికా పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. మంగళవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. వర్షం ఆటంకం కల్గించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IND vs SA: 16 ఏళ్ల ధోని రికార్డును బద్దలుకొట్టిన సూర్యకుమార్ యాదవ్

ఎబేహ: సౌతాఫ్రికా పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. మంగళవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. వర్షం ఆటంకం కల్గించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న దశలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య.. తిలక్ వర్మ, రింకూ సింగ్‌తో కలిసి ఆదుకున్నాడు. ఈ క్రమంలో తన టీ20 కెరీర్‌లో 17వ హాఫ్ సెంచరీని చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 36 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 5 ఫోర్లు, 3 సిక్సులతో 56 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 16 ఏళ్ల రికార్డును సూర్యకుమార్ యాదవ్ బ్రేక్ చేశాడు. టీ20 ఫార్మాట్‌లో సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. అలాగే పొట్టి ఫార్మాట్‌లో సఫారీ గడ్డపై హాఫ్ సెంచరీ చేసిన తొలి టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు. కాగా 2007లో సౌతాఫ్రికాలో టీ20 మ్యాచ్‌లో కెప్టెన్‌గా ధోని 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ సాధించాడు. ఇప్పటివరకు సఫారీ గడ్డపై టీమిండియా కెప్టెన్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఇదే ఉంది. తాజాగా ధోని రికార్డును సూర్య బద్దలుకొట్టాడు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ డకౌట్లు అయినప్పటికీ సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ హాఫ్ సెంచరీలతో చెలరేగి జట్టును ఆదుకున్నారు. తిలక్ వర్మ 29, రవీంద్ర జడేజా 19 పరుగులు చేశారు. అయితే వర్షం రావడంతో మరో 3 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా ఇన్నింగ్స్‌ను ముగించాల్సి వచ్చింది. 9 ఫోర్లు, 2 సిక్సులతో 39 బంతుల్లో 68 పరుగులు చేసిన రింకూ సింగ్ నాటౌట్‌గా నిలిచాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో రింకూ సింగ్‌కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ. వర్షం ఆగాక డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సౌతాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లో 152 పరుగులుగా నిర్ణయించారు. అయితే 13.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా లక్ష్యాన్ని చేధించింది.

Updated Date - 2023-12-13T07:47:32+05:30 IST