Share News

IND vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. టీమిండియా తుది జట్టు ఇదే!

ABN , First Publish Date - 2023-10-19T13:45:58+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

IND vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. టీమిండియా తుది జట్టు ఇదే!

పుణె: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో హెడ్స్ చెప్పాడు. కాయిన్ హెడ్సే పడింది. దీంతో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. కాగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. దీంతో నజ్ముల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే టాస్ గెలిస్తే తాను ముందుగా బౌలింగే తీసుకోవాలని అనుకున్నానని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. దీంతో టాస్ గెలవకపోయినా ముందుగా బౌలింగ్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌ మాత్రం కెప్టెన్ షకీబ్‌తోపాటు తమ తుది జట్టులో మరో మార్పు కూడా చేసింది. పేసర్ టస్కిన్ స్థానంలో హాసన్‌ను తుది జట్టులోకి తీసుకుంది.


తుది జట్లు

బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

గత రికార్డులు

భారత్, బంగ్లాదేశ్ హెడ్ టూ హెడ్ రికార్డుల విషయానికొస్తే రెండు జట్లు వన్డేల్లో ఇప్పటివరకు 40 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. రెండు జట్ల పోటీల్లో టీమిండియా సంపూర్ణ అధిపత్యం ప్రదర్శించింది. ఏకంగా 31 మ్యాచ్‌ల్లో గెలిచింది. బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఓవరాల్ రికార్డులు బాగానే ఉన్నా ఇటీవల బంగ్లాదేశ్‌పై భారత్ గణాంకాలు ఏమంతంగా బాగాలేవు. బంగ్లాదేశ్‌తో ఆడిన చివరి 4 వన్డేల్లో టీమిండియా మూడే గెలిచింది. ఆసియా కప్‌లో సైతం బంగ్లా చేతిలో భారత్ ఓడిపోయింది. అలాగే 2007 ప్రపంచకప్‌లో భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించిన రికార్డు కూడా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా ఏ మాత్రం తేలికగా తీసుకోవడం లేదు. మొత్తంగా వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్, బంగ్లాదేశ్ ఇప్పటివరకు 4 సార్లు తలపడ్డాయి. అత్యధికంగా టీమిండియా 3 సార్లు.. బంగ్లాదేశ్ ఒకసారి గెలిచాయి.

Updated Date - 2023-10-19T13:51:23+05:30 IST