Share News

IND vs AUS: వరల్డ్ కప్ ఫైనల్ జరిగే అహ్మదాబాద్ స్టేడియం గత రికార్డులపై ఓ లుక్కేయండి!

ABN , First Publish Date - 2023-11-18T13:18:56+05:30 IST

World cup 2023: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభంకానుంది. తుది పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లక్ష 30 వేల మంది ప్రేక్షకుల సిట్టింగ్ సామర్థ్యం గల అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

IND vs AUS: వరల్డ్ కప్ ఫైనల్ జరిగే అహ్మదాబాద్ స్టేడియం గత రికార్డులపై ఓ లుక్కేయండి!

అహ్మదాబాద్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభంకానుంది. తుది పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లక్ష 30 వేల మంది ప్రేక్షకుల సిట్టింగ్ సామర్థ్యం గల అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. బ్యాటర్లకు, బౌలర్లకు సమాన సహకారం అందించే ఈ పిచ్‌పై ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే మోదీ స్టేడియంలో ఇప్పటివరకు 30 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లు 15 మ్యాచ్‌ల్లో, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లు 15 సార్లు గెలిచాయి. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 243గా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 208గా ఉంది. ఈ పిచ్‌పై అత్యధిక స్కోర్ 365 కాగా.. అత్యల్ప స్కోర్ 85గా ఉంది. ఇక్కడ అత్యధిక చేధన 325 పరుగులుగా ఉంది. టాస్ గెలిచిన జట్లు 17 మ్యాచ్‌ల్లో గెలిస్తే.. టాస్ ఓడిన జట్లు 13 మ్యాచ్‌ల్లో గెలిచాయి.


ఈ పిచ్‌లో స్పిన్నర్ల కన్నా పేసర్లకే ఎక్కువ వికెట్లు పడతాయని గత రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ పేస్ బౌలర్లు 246 వికెట్లు తీయగా.. స్పిన్ బౌలర్లు 135 వికెట్లు తీశారు. వన్డే ఫార్మాట్లో భారత్, ఆస్ట్రేలియా హెడ్ టూ హెడ్ వన్డే రికార్డుల విషయానికొస్తే ఇప్పటివరకు రెండు జట్లు 150 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా 83 మ్యాచ్‌ల్లో గెలిచింది. భారత జట్టు 57 మ్యాచ్‌ల్లో గెలిచింది. 10 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ప్రస్తుతం రెండు జట్లు అన్ని విభాగాల్లో బలంగా ఉన్నాయి. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచింది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. దీంతో ఈ టోర్నీలో టీమిండియా వరుసగా 10 విజయాలు నమోదు చేసింది. ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే ప్రపంచకప్‌ను నిరాశజనక ఫలితాలతో ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా విజయాలు సాధించింది. ప్రారంభంలో వరుసగా ఎదురైన రెండు ఓటములు మినహా ఆ తర్వాత మళ్లీ ఓడిపోలేదు. లీగ్ దశలో వరుసగా 7 విజయాలతోపాటు సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాపై విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది.

Updated Date - 2023-11-18T13:35:15+05:30 IST