Share News

World cup: క్రికెట్ అంటే ఒక ఆట కాదు, భావోద్వేగం.. ఆ పిల్లాడిది అఫ్గానిస్థాన్ కాదు.. ఇండియానే!

ABN , First Publish Date - 2023-10-18T13:00:10+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 15న జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను పసికూన అఫ్గానిస్థాన్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన అఫ్గాన్ జట్టు 69 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

World cup: క్రికెట్ అంటే ఒక ఆట కాదు, భావోద్వేగం.. ఆ పిల్లాడిది అఫ్గానిస్థాన్ కాదు.. ఇండియానే!

ఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 15న జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను పసికూన అఫ్గానిస్థాన్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన అఫ్గాన్ జట్టు 69 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే ఓ పిల్లవాడు విజయం సాధించగానే మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి అఫ్గానిస్థాన్ ఆటగాడు ముజీబ్ రెహ్మాన్‌ను కౌగిలించుకున్నాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన ఆ పిల్లవాడు ఆనంద భాష్పాలతో వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ పిల్లాడి అభిమానానికి పొంగిపోయిన ముజీబ్ అతన్ని ఓదార్చాడు. నీళ్లు ఇచ్చి, ఓ చాక్లెట్ కూడా ఇచ్చాడు. ఆ పిల్లవాడు వెక్కి వెక్కి ఏడ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ బుడ్డోడి అభిమానాన్ని చూసి నెటిజన్లు మురిసిపోయారు. అయితే ఆ పిల్లాడిది అఫ్గానిస్థాన్ దేశం అయి ఉంటుందని అంతా భావించారు. కానీ నిజానికి ఆ పిల్లాడిది అఫ్గానిస్థాన్ కాదట. ఇండియానే అట. ఈ విషయాన్ని స్వయంగా ముజీబ్ రెహ్మానే సోషల్ మీడియా వేదికగా చెప్పాడు.


‘‘అతను అఫ్గానిస్థాన్ కుర్రాడు కాదు. అతను భారతీయ కుర్రాడే. మా విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు. గత రాత్రి ఆ కుర్రాడిని కలవడం చాలా సంతోషంగా ఉంది. క్రికెట్ కేవలం ఆట కాదు భావోద్వేగం అని ఈ కుర్రాడు తెలియచేశాడు. మాకు మద్దతిచ్చిన భారత అభిమానులదరికీ ధన్యవాదాలు. మీ మద్దతుకు, ప్రేమకు మేము కృతజ్ఞులం. భవిష్యత్‌లో మాకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను.’’ అని ముజీబ్ రెహ్మాన్ ట్వీట్ చేశాడు.

Updated Date - 2023-10-18T14:04:27+05:30 IST