స్నేహితులతో కలిసి న్యూఇయర్ వేడుకుల్లో పాల్గొన్న యువతి.. రాత్రి అంతా నిద్రపోయాక సడన్‌గా ఆమె చేసిన పని..

ABN , First Publish Date - 2023-01-01T19:26:05+05:30 IST

ఓ యువతి.. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న రాత్రి స్నేహితులతో కలిసి సరదాగా గడిపింది. వేకువజాము వరకూ అంతా సరదాగా గడిపారు. వేకువజాము అంతా నిద్రలోకి జారుకున్నారు. ఆ సమయంలో..

స్నేహితులతో కలిసి న్యూఇయర్ వేడుకుల్లో పాల్గొన్న యువతి.. రాత్రి అంతా నిద్రపోయాక సడన్‌గా ఆమె చేసిన పని..

ఓ యువతి.. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న రాత్రి స్నేహితులతో కలిసి సరదాగా గడిపింది. వేకువజాము వరకూ అంతా సరదాగా గడిపారు. వేకువజాము అంతా నిద్రలోకి జారుకున్నారు. ఆ సమయంలో ఓ యువతి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..

Viral Video: స్నేహితుడిని కాపాడుకునేందుకు సింహాన్నే ఎదిరించిన కుక్క.. తీవ్రంగా శ్రమించింది కానీ..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్ పరిధి తుకోగంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక హెచ్‌ఐజీ ప్రాంతంలో ఉంటున్న ప్రథమ్ అనే యువతి హైదారాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా (Software Engineer) పని చేస్తోంది. అయితే ఇటీవల వర్క్ ఫ్రం హోమ్ (Work from home) చేస్తుండడంతో ఇంటి వద్దే ఉంటోంది. కాగా, నూతన సంవత్సరం (new year) సందర్భంగా డిసెంబర్ 31రాత్రి వేడుకలు నిర్వహించాలని స్నేహితులంతా నిర్ణయించుకున్నారు. దీంతో రెండు రోజుల క్రితం ప్రథమ్.. తన స్నేహితురాలి వద్దకు వెళ్లింది. 31న రాత్రి అంతా వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము 3గంటల వరకూ అంతా సరదా సరదాగా గడిపారు. ఆ సమయంలో ప్రథమ్.. ల్యాప్‌టాప్‌లో చాలా చేపు ఏదో పని చేసుకుంటూ ఉండిపోయింది. కాసేపటికి ఆమె స్నేహితులంతా నిద్రలోకి జారుకున్నారు.

Viral Video: మహిళను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించారు.. కాసేపటికి కారు దిగి పరుగులు పెట్టారు..

అయితే తర్వాత ఆమె ఉన్నట్టుండి ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య (suicide) చేసుకుంది. రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న యువతిని గమనించిన సెక్యూరిటీ గార్డు.. పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గదిలో రెండు పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తనకు ఏదో అరుదైన వ్యాధి (rare disease) ఉందని, ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియదని.. రాసి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి ఆత్మహత్యకు వ్యాధి మాత్రమే కారణమా.. లేక ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

కూలి పనికి వెళ్లే యువకుడికి.. యజమాని భార్యతో పరిచయం.. ఓ రోజు రాత్రి భర్తకు తెలిసి..

Updated Date - 2023-01-01T19:26:45+05:30 IST