Viral Video: స్నేహితుడిని కాపాడుకునేందుకు సింహాన్నే ఎదిరించిన కుక్క.. తీవ్రంగా శ్రమించింది కానీ..

ABN , First Publish Date - 2023-01-01T16:18:46+05:30 IST

గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులి అవుతుందనేది సామెత. చిన్న ప్రాణులే కదా అని చిన్నచూపు చూస్తే.. కొన్నిసార్లు మొదటికే మోసం వస్తుంది. తమని తాము కాపాడుకునే క్రమంలో అప్పుడప్పుడూ చిన్న చిన్న జంతువులు.. పెద్ద పెద్ద జంతువులతో..

Viral Video: స్నేహితుడిని కాపాడుకునేందుకు సింహాన్నే ఎదిరించిన కుక్క.. తీవ్రంగా శ్రమించింది కానీ..

గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులి అవుతుందనేది సామెత. చిన్న ప్రాణులే కదా అని చిన్నచూపు చూస్తే.. కొన్నిసార్లు మొదటికే మోసం వస్తుంది. తమని తాము కాపాడుకునే క్రమంలో అప్పుడప్పుడూ చిన్న చిన్న జంతువులు.. పెద్ద పెద్ద జంతువులతో పోటీ పడడం చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుక్క (dog) తన స్నేహితుడిని కాపాడుకునేందుకు ఏకంగా సింహాన్ని కూడా లెక్కచేయలేదు. చివరి వరకూ ఎక్కడా తగ్గకుండా ఎదిరించేందుకు ప్రయత్నించడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు..

Viral Video: రైలు దిగుతుండగా డోరు మధ్యలో చిక్కుకున్న యువతి డ్రెస్.. రైలు ఆపాలని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ సింహం (lion) అటవీ ప్రాంతంలోని ఇళ్లల్లోకి చొరబడుతుంది. ఓ ఇంటి ఆవరణలో ఉన్న కుక్కను పట్టుకుంటుంది. మెడను గట్టిగా పట్టుకోవడంతో (Lion attack on dog) గిలాగిలా కొట్టుకుంటూ ఉంటుంది. పక్కనే మరో కుక్క కూడా ఉంటుంది. సాధారణంగా సింహాన్ని చూడగానే పారిపోవాల్సిన కుక్క.. అందుకు విరుద్ధంగా తన స్నేహితుడిని కాపాడుకునేందుకు సింహాన్ని సైతం లెక్కచేయదు. నా స్నేహితుడిని వదులుతావా.. లేదా.. అన్నట్లుగా మొరుగుతూ సింహాన్ని హెచ్చరిస్తుంది.

భార్య ఎదుటే కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన భర్త.. బయట ఎవరికీ చెప్పొద్దని బెదిరించి.. చివరకు..

అయినా సింహం మాత్రం కుక్కను గట్టిగా పట్టుకుని ఉంటుంది. దీన్ని గమనించిన ఇంటి పైన ఉన్న ఓ వ్యక్తి సింహాన్ని తరిమేందుకు కర్రను విసిరి కొడతాడు. అయినా ఇవేవీ సింహం పట్టించుకోకుండా కుక్కను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు సింహం నుంచి తప్పించుకునేందుకు కుక్క ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఇక్కడితో ఈ వీడియో ముగుస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు కుక్క ధైర్యాన్ని చూసి శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.

Viral Video: కోబ్రాపై తుపాకీతో కాల్పులు జరిపిన యువకులు.. పారిపోవాల్సిన పాము చివరికి ఏం చేసిందంటే..

Updated Date - 2023-01-01T16:18:52+05:30 IST