Share News

Viral Video: ఇంత టాలెంట్ ఏంటి తల్లీ..? ఈగ సినిమాలో సమంతను మించిపోయేలా ఉందిగా.. టీ వడబోసుకునేందుకు ఏం చేసిందో చూస్తే..!

ABN , First Publish Date - 2023-10-31T13:55:37+05:30 IST

సోషల్ మీడియా వినియోగం విస్తృతమైన ప్రస్తుత కాలంలో చాలామంది చాలా వినూత్న ఆలోచనలతో నెట్టింట హల్‌చల్ చేయడం పరిపాటిగా మారింది.

Viral Video: ఇంత టాలెంట్ ఏంటి తల్లీ..? ఈగ సినిమాలో సమంతను మించిపోయేలా ఉందిగా.. టీ వడబోసుకునేందుకు ఏం చేసిందో చూస్తే..!

Woman Made Chai Ki Channi In Her Nails Viral Video: సోషల్ మీడియా వినియోగం విస్తృతమైన ప్రస్తుత కాలంలో చాలామంది చాలా వినూత్న ఆలోచనలతో నెట్టింట హల్‌చల్ చేయడం పరిపాటిగా మారింది. ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్టుగా.. తీరొక్క పనులు చేసి వాటి తాలూకు ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇలా ప్రతిరోజూ లక్షలాది వీడియోలు నెట్టింట ప్రత్యక్షం అవుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే వైరల్‌ అవుతున్నాయి. దాంతో కొందరు రాత్రికి రాత్రే స్టార్డమ్ సొంతం చేసుకుంటున్నారు కూడా. ఇదే కోవలో తాజాగా ఓ మహిళకు చెందిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. వీడియలో ఆ మహిళ టీ వడబోసుకునేందుకు ఏం చేసిందో చూస్తే..! నోరెళ్లబెట్టాల్సిందే. అందుకే వీడియో చూసిన నెటిజన్లు 'తల్లి నీ టాలెంట్‌కు సలాం.. ఈగ సినిమాలో సమంతను మించిపోయేలా ఉందిగా..' అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.

Dhoni Viral Video: ధోనీ సడన్‌గా మీ ఇంటికొచ్చి మ్యాచ్ చూస్తానంటే.. ఓ వింత కండీషన్ పెట్టి మరీ ఇంట్లోకి వస్తానంటే..!

అసలు వీడియోలో ఏముందంటే.. ఓ మహిళ తన చేతి బొటనవేలి గోరును టీ వడబోసుకునేందుకు కూసింత వెరైటీగా ఫ్యాషన్‌ను జోడించింది. మొదట గోరు మధ్య భాగంలో దీర్ఘచతురస్త్రం ఆకారం వచ్చేలా కత్తిరించింది. ఆ తర్వాత దానికి గమ్‌తో టీని వడబోసుకునేందుకు వీలుగా ఒక జల్లెడను అతికించింది. ఆ తర్వాత టీ కాచి.. అప్పటికే జల్లెడ కట్టి రెడీ చేసుకున్న బొటనవేలి గోరు సహయంతో దాన్ని వడబోయడం మనం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను rajat.write అనే ఇన్‌స్టాగ్రాం (Instagram) ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి 'టీ లవర్స్ తప్పకుండా ఒకసారి ఇది ట్రై చేయండి. ఇప్పుడు ఎక్కడైనా, ఎప్పుడైనా టీ ఎంజాయ్ చేయవచ్చు' అనే లైన్స్‌ను జోడించారు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. 'దీని అర్థం ఏదైనా జరగొచ్చన్నమాట' అని ఒకరంటే, 'ఇంకా మాకు చూడటానికి ఏముంది. ఆమె ఉర్ఫీ జావెద్ సోదరిలా ఉంది' అని మరొకరు అన్నారు. అలాగే 'హే.. నీ వేలు కాలిపోతుందేమో చూసుకో' అని ఇంకొకరు కామెంట్ చేస్తే, 'ఆమె తప్పకుండా ఉర్ఫీ జావెద్‌ను దాటిపోతుంది', 'ఇలాంటి ప్రమాదకరమైన ఫ్యాషన్ చేయకండి సిస్టర్' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

MMA Match Video: 19 ఏళ్ల యువతితో 50 ఏళ్ల మహిళ ఫైటింగ్.. రింగ్‌లో ఎదురుగా కొడుకు మాజీ ప్రేయసి.. అసలెవరు గెలిచారంటే..!


Updated Date - 2023-10-31T13:55:53+05:30 IST