Share News

MMA Match Video: 19 ఏళ్ల యువతితో 50 ఏళ్ల మహిళ ఫైటింగ్.. రింగ్‌లో ఎదురుగా కొడుకు మాజీ ప్రేయసి.. అసలెవరు గెలిచారంటే..!

ABN , First Publish Date - 2023-10-31T12:31:40+05:30 IST

ఓ 'మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్' (Mixed Martial Arts) మ్యాచ్ తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో ఓ 50 ఏళ్ల మహిళ.. 19 ఏళ్ల యువతితో ఫైటింగ్ చేయడం ఉంది.

MMA Match Video: 19 ఏళ్ల యువతితో 50 ఏళ్ల మహిళ ఫైటింగ్.. రింగ్‌లో ఎదురుగా కొడుకు మాజీ ప్రేయసి.. అసలెవరు గెలిచారంటే..!

MMA Match Video: ఓ 'మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్' (Mixed Martial Arts) మ్యాచ్ తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో ఓ 50 ఏళ్ల మహిళ.. 19 ఏళ్ల యువతితో ఫైటింగ్ చేయడం ఉంది. ఇక్కడ రెండు విషయాలు చాలా ట్విస్ట్‌గా ఉన్నాయి. ఒకటి వారిద్దరి మధ్య వయో భేదం కాగా, రెండోది 50ఏళ్ల మహిళ తలపడిన ఆ యువతి ఎవరో తెలుసా? ఆమె కుమారుడి మాజీ లవర్ (Ex-girlfriend ). ఇక mma.pl లో పేర్కొన్న సమాచారం ప్రకారం ఆ పెద్దావిడ పేరు గోసియా మ్యాజికల్ (Gosia Magical) కాగా, ఆమెతో తలపడిన యువతి పేరు నిఖిత (Nikita). గోసియా కుమారుడైన డానియల్ పోలాండ్ (Daniel Poland) తో నిఖితకు ఇటీవలే బ్రేకాప్ (Breakup) అయింది.

Dhoni Viral Video: ధోనీ సడన్‌గా మీ ఇంటికొచ్చి మ్యాచ్ చూస్తానంటే.. ఓ వింత కండీషన్ పెట్టి మరీ ఇంట్లోకి వస్తానంటే..!

ఈ క్రమంలోనే గోసియా, నిఖితల మధ్య ఏంఏంఏ (MMA) మ్యాచ్ సెట్ అయింది. ఈ నెల 29న ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో జనం కూడా వచ్చారు. ఇంకేముంది.. ఆ భారీ జనం ముందు రింగ్‌లో ప్రత్యర్థులు ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. చివరికి ఎవరు గెలిచి ఉంటారు? అంటే.. టక్కున వచ్చే సమాధానం యంగ్ లేడీనే గెలిచి ఉంటుందని. కానీ, ఇక్కడ విజయం వరించింది మాత్రం పెద్దావిడను. అవును.. మీరు విన్నది నిజమే. ఈ మ్యాచ్‌లో గెలిచింది 50 ఏళ్ల మహిళనే. కొడుకు మాజీ గర్ల్‌ఫ్రెండ్‌పై మ్యాచ్ గెలిచి వారి బ్రేకాప్‌పై రివెంజ్ తీర్చుకుందన్నమాట. ఇప్పుడీ మ్యాచ్ తాలూకు 15 సెకండ్ల నిడివి గల వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. 'ఎక్స్' (ట్విటర్) లో ఈ వీడియోను ఇప్పటివరకు 58వేల మందికి పైగా వీక్షించారు. ఇంకేందుకు ఆలస్యం మీరు మ్యాజికల్ ఫైటింగ్ వీడియోపై ఓ లుక్కేయండి.

Viral Video: ఈ డాక్టరమ్మను ఆ తల్లి జీవితాంతం మర్చిపోదు.. పుట్టగానే బిడ్డలో ఏమాత్రం చలనం లేకపోతే.. ఏం చేసి బతికించిందంటే..!

Updated Date - 2023-10-31T12:33:18+05:30 IST