Share News

Dhoni Viral Video: ధోనీ సడన్‌గా మీ ఇంటికొచ్చి మ్యాచ్ చూస్తానంటే.. ఓ వింత కండీషన్ పెట్టి మరీ ఇంట్లోకి వస్తానంటే..!

ABN , First Publish Date - 2023-10-31T11:45:57+05:30 IST

మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni).. కెప్టెన్ కూల్. భారత్‌కు మూడు అంతర్జాతీయ ట్రోఫీలు అందించిన ఏకైక సారథి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు పలికి చాలా రోజులు గడిచిన ఆయనపై అభిమానం ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు నిదర్శనం తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో.

Dhoni Viral Video: ధోనీ సడన్‌గా మీ ఇంటికొచ్చి మ్యాచ్ చూస్తానంటే.. ఓ వింత కండీషన్ పెట్టి మరీ ఇంట్లోకి వస్తానంటే..!

Dhoni Viral Video: మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni).. కెప్టెన్ కూల్. భారత్‌కు మూడు అంతర్జాతీయ ట్రోఫీలు అందించిన ఏకైక సారథి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు పలికి చాలా రోజులు గడిచిన ఆయనపై అభిమానం ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు నిదర్శనం తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో. వీడియోలో సడన్‌గా ధోనీ ఓ ఇంటికి వెళ్లి మీతో కలిసి మ్యాచ్ చూడొచ్చా? అని అడగడం మనం గమనించవచ్చు. అభిమాన క్రికెటర్ ఇలా ఇంటికి వచ్చి మ్యాచ్ చూద్దామంటే.. ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. కానీ, ఇక్కడే మహీ ఒక కండీషన్ పెట్టడం జరుగుతుంది. అదేంటంటే.. మీ ఇంట్లో లేస్ చిప్స్ (Lays Chips) ఉంటేనే అని మెలిక పెట్టడంతో చాలా మంది ఆ లక్కీ ఛాన్స్ కోల్పోవడం వీడియోలో చూపించారు.

Viral Video: ఈ డాక్టరమ్మను ఆ తల్లి జీవితాంతం మర్చిపోదు.. పుట్టగానే బిడ్డలో ఏమాత్రం చలనం లేకపోతే.. ఏం చేసి బతికించిందంటే..!

ఇలా ఓ ఐదారు ఇళ్లు తిరిగిన తర్వాత ఓ ఇంట్లోని యువత రెండు లేస్ ప్యాకెట్లతో మహీకి వెల్‌కం చెబుతారు. అంతే.. ధోనీ వారితో కలిసి మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు. ఇది ఆ వైరల్ వీడియోలో ఉన్న కంటెంట్. మీరూ ఇప్పటికే ఈ వీడియో చూసుంటారు. అలాగే ఇది ఒక యాడ్ (Advertisement) అని కూడా మీకు తెలిసే ఉంటుంది. కానీ, నిజంగా చెప్పాలంటే యాడ్ మేకర్ వాళ్లది సూపర్ క్రియేటివిటీ అని చెప్పాలి. ఇప్పుడీ లేస్ వ్యాపార ప్రకటన తాలూకు వీడియో సోషల్ మీడియా (Social Media) లో తెగ వైరల్ అవుతుంది. 'ఎక్స్' (ట్విటర్) లో ఈ వీడియోకు ఇప్పటివరకు 5లక్షలకు పైగా వ్యూస్, 10వేల వరకు లైక్స్ వచ్చాయి. అలాగే ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 'ఇది కలలో మాత్రమే సాధ్యం' అని ఒకరు అంటే, 'ఎవరికి తెలుసు.. ఏమో తర్వాతి నంబర్ నాదే కావొచ్చు. అందుకే ఇప్పటి నుంచి ఇంట్లో లేస్ ప్యాకెట్లు ఉండేలా చూసుకుంటా' అని మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు.

Viral News: ఒకేసారి రూ.6.50 కోట్లను విత్‌డ్రా.. డబ్బు తీసుకునేందుకు ఆ వ్యక్తి పెట్టిన వింత కండీషన్‌కు బ్యాంకు సిబ్బంది షాక్.. చివరకు..!

Updated Date - 2023-10-31T11:45:57+05:30 IST