Viral Video: భార్యలు తమ భర్తలకు అస్సలు ఇవ్వనిదేంటి..? ఈ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నకు ఆ కుర్రాడి సమాధానం వింటే..!

ABN , First Publish Date - 2023-07-20T13:18:45+05:30 IST

దంపతులు ఎప్పుడూ రెండు విభిన్న ధృవాలే. ఇది ఎవరు కాదనలేని వాస్తవం కూడా.

Viral Video: భార్యలు తమ భర్తలకు అస్సలు ఇవ్వనిదేంటి..? ఈ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నకు ఆ కుర్రాడి సమాధానం వింటే..!

Viral Video: దంపతులు ఎప్పుడూ రెండు విభిన్న ధృవాలే. ఇది ఎవరు కాదనలేని వాస్తవం కూడా. ఎందుకంటే ఎంత అన్యోన్యంగా ఉండే దంపతులైన సరే.. ఏదోక సమయంలో వారి మధ్య అభిప్రాయ బేధాలు రావడం కామన్. ఇక ఇప్పటి జనరేషన్ జంటల విషయానికి వస్తే.. ఎప్పుడు కలిసి ఉంటారో? ఎప్పుడు విడిపోతారో? తెలియని పరిస్థితి. చిన్నచిన్న కారణాలకే మనస్పర్థలు, విడిపోవడాలు చేస్తున్నారు. ఇలా ప్రతి సంబంధం లేదా వివాహ బంధానికి హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ.. స్త్రీ/పురుషుడు చేసే కొన్ని విషయాలు వారి సంబంధాన్ని నాశనం చేయగలవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఇదంతా దేనికనేగా మీ అనుమానం అక్కడికే వస్తున్నాం. ఓ పాకిస్థానీ జర్నలిస్ట్ ఇటీవల నిర్వహించిన భార్యాభర్తల అనుబంధానికి సంబంధించిన ఇంటర్వ్యూ తాలూకు వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అందులో ఆ లేడీ జర్నలిస్ట్ అడిగిన ఒక ప్రశ్నకు ఓ కుర్రాడు ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు సరదా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఇంతకీ ఆ లేడీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే.. భార్య తన భర్తకు అస్సలు ఇవ్వనిదేంటి..? మొదట ఈ ప్రశ్నకు ఆ పాకిస్తానీ లేడీ ఇంటర్వ్యూయర్‌కు పురుషుల నుండి వివిధ రకాల సమాధానాలను వచ్చాయి. అయితే, ఓ కుర్రాడు మాత్రం అదిరిపోయే సమధానం ఇచ్చాడు. అదేంటంటే.. 'శాంతి' (Sukoon-సుకూన్). అంతే.. ఈ సమాధానంపై ఇప్పుడు కొందరు నెటిజన్లు రెండుగా విడిపోయి మరీ సరదా కామెంట్లు పెడుతున్నారు. 'బ్రదర్ మొదటిసారి నిజం చెప్పి ఎంతో ఆనందం కలిగించావు' అని ఒకరు, 'అతని మాటల్లో ఎంత శాంతి ఉంది. ముందు నీవు ఇంటికి వెళ్లు. నీకు ఇక అంతా శాంతియే' అని మరొకరు, 'మనసులో మాట చెప్పినవు భాయ్' అని ఇంకొకరు కామెంట్ చేశారు. అయితే, ఆ లేడీ జర్నలిస్ట్ అడిగిన ఈ కామన్ సెన్స్ ప్రశ్నకు సరైన సమాధానం.. 'భర్త చనిపోతే.. అతడిని తీసుకెళ్లే పాడెకు ఆసరాగా తమ భుజాన్ని భార్యలు ఇవ్వరు..' అని.

Duty Free Draw: జర్నీ చేస్తూ సరదాగా కొన్న లాటరీ టికెట్.. భారతీయుడికి రూ.8 కోట్లు తెచ్చిపెట్టింది.. తీరా రాఫెల్ నిర్వాహకులు ఫోన్ చేస్తే..!


Updated Date - 2023-07-20T13:18:45+05:30 IST