Duty Free Draw: జర్నీ చేస్తూ సరదాగా కొన్న లాటరీ టికెట్.. భారతీయుడికి రూ.8 కోట్లు తెచ్చిపెట్టింది.. తీరా రాఫెల్ నిర్వాహకులు ఫోన్ చేస్తే..!

ABN , First Publish Date - 2023-07-20T11:49:37+05:30 IST

దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్‌ (Dubai Duty Free Millennium Millionaire) లో భార‌తీయుడు జాక్‌పాట్ కొట్టాడు.

Duty Free Draw: జర్నీ చేస్తూ సరదాగా కొన్న లాటరీ టికెట్.. భారతీయుడికి రూ.8 కోట్లు తెచ్చిపెట్టింది.. తీరా రాఫెల్ నిర్వాహకులు ఫోన్ చేస్తే..!

దుబాయి: దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్‌ (Dubai Duty Free Millennium Millionaire) లో భార‌తీయుడు జాక్‌పాట్ కొట్టాడు. భార‌తీయ వ్యక్తి వినయ్ శ్రీకర్ చోడంకర్ (Vinay Shreekar Chodankar) దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో 1మిలియ‌న్ డాల‌ర్లు(రూ. 8.20కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో వినయ్ శ్రీకర్ రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడ‌య్యాడు. బుధవారం నిర్వహించిన లక్కీ డ్రాలో జూన్ 30వ తారీఖున ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్ నెం. 3588కు జాక్‌పాట్ త‌గిలింది. ముంబైకి చెందిన వినయ్ శ్రీకర్ జూన్ 30న దుబాయి (Dubai) నుంచి సౌదీ అరేబియాలోని తబుక్ (Tabuk) జర్నీ చేస్తున్న సమయంలో అతడు ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అలా ప్రయాణం చేస్తున్న సమయంలో సరదాగా కొన్న లాటరీ టికెట్ అతడికి కోట్లు తెచ్చిపెట్టింది.

కాగా, బుధవారం నిర్వహించిన డ్రాలో వినయ్ శ్రీకర్ టికెట్‌కు లాటరీ తగలడంతో నిర్వాహకులు అతడి ఫోన్ నంబర్‌కు కాల్ చేశారు. కానీ, కలవలేదు. దాంతో ఇతర మార్గాల్లో అతనికి ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ & సీఈఓ కోల్మ్ మెక్‌లౌగ్లిన్ వెల్లడించారు. ఇక‌ 1999లో ప్రారంభ‌మైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ 1 మిలియ‌న్ డాల‌ర్లు గెలుచుకున్న భార‌తీయుల్లో వినయ్ శ్రీకర్ 212వ వ్య‌క్తి. కాగా, ఈ డ్యూటీ ఫ్రీ రాఫెల్ టికెట్ల కొనుగోలుదారుల్లో అత్యధికులు భార‌తీయులేన‌ని రాఫెల్ నిర్వాహ‌కులు వెల్లడించారు.

Dubai to India: దుబాయి నుంచి స్వదేశానికి వస్తున్న కూతురు.. తల్లిని ఏం గిఫ్ట్ తేవాలని అడిగితే.. ఆమె అడిగిందేంటో తెలిస్తే..

Updated Date - 2023-07-20T11:49:37+05:30 IST