Viral Video: పాము, ముంగిస మధ్య బిగ్ ఫైట్.. ఆశ్చర్యకరంగా చివర్లో ఇలా జరిగిందేంటీ..

ABN , First Publish Date - 2023-03-15T16:20:49+05:30 IST

పాముకు బద్ధ శత్రువు ఎవరంటే.. టక్కున ముంగిస పేరు గుర్తుకు వస్తుంది. ఇవి ఎక్కడ ఎదురుపడినా పోరాటం తప్పదు. ఎన్నిసార్లు పోరాడినా ఎక్కువ శాతం ముంగిసదే పైచేయి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే అప్పుడప్పుడూ ఇందుకు..

Viral Video: పాము, ముంగిస మధ్య బిగ్ ఫైట్.. ఆశ్చర్యకరంగా చివర్లో ఇలా జరిగిందేంటీ..

పాముకు బద్ధ శత్రువు ఎవరంటే.. టక్కున ముంగిస పేరు గుర్తుకు వస్తుంది. ఇవి ఎక్కడ ఎదురుపడినా పోరాటం తప్పదు. ఎన్నిసార్లు పోరాడినా ఎక్కువ శాతం ముంగిసదే పైచేయి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే అప్పుడప్పుడూ ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. పాము, ముంగిస పోరాటానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాము, కోబ్రా మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. అయితే చివర్లో ఆశ్చర్యకరంగా విచిత్ర ఘటన చోటు చేసుకుంటుంది.

సోషల్ మీడియాలో పాము, ముంగిస పోరాటానికి సంబంధించిన వీడియో (snake and mongoose fighting Videos) వైరల్‌గా మారింది. పడగ విప్పి బుసకొట్టడానికి ప్రయత్నించిన కోబ్రా (Cobra) మీద ముంగిస దాడి చేస్తుంది. వెళ్లీవెళ్లగానే పాము తల కింది భాగంలో నోటితో గట్టిగా పట్టుకుంటుంది. దీంతో పాము ఒక్కసారిగా విలవిల్లాడిపోతుంది. దాని నుంచి తప్పించుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంది. అయినా చాలా సేపు దానికి సాధ్యం కాదు. ఈ క్రమంలో ముంగిసపై కాటు (snake bite) వేస్తుంది.

Viral Video: మొబైల్ ధ్యాసలో పడితే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడి వాలకం చూసి పగలబడి నవ్వుకుంటున్న నెటిజన్లు..

అయినా ముంగిస మాత్రం పామును వదలకుండా అలాగే పట్టుకుని ఉంటుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించే క్రమంలో పాము పలుమార్లు ముంగిసపై దాడి (Snake attack on mongoose) చేస్తుంది. ఈ దాడిలో ముంగిస తీవ్రగా గాయపడినట్లు వీడియోలో చూడొచ్చు. వీడియో ఇంతటితో ముగుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ముంగిస పరిస్థితి విషమంగా ఉన్నట్లే కనిపిస్తోంది. ఇదిలావుండగా, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో (Trending videos) ట్రెండింగ్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశిస్తున్న కోతి.. అడుగడుగుకూ దండాలు పెడుతూ.. ఎలా వేడుకుంటుందో చూడండి..

Updated Date - 2023-03-15T16:20:49+05:30 IST