సీసీ కెమెరాలను గమనించని పోలీసులు.. నడి రోడ్డుపై కారు ఆపి మరీ ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2023-01-04T21:06:43+05:30 IST

ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో చిన్న చిన్న నేరాలు సైతం ఇట్టే బయటపడుతున్నాయి. ఇక పెద్ద పెద్ద నేరాలు జరిగిన సమయంలోనూ నేరస్థులను సులభంగా పట్టుకోగలుగుతున్నారు. ఒక్క సీసీ కెమెరా..

సీసీ కెమెరాలను గమనించని పోలీసులు.. నడి రోడ్డుపై కారు ఆపి మరీ ఏం చేశారంటే..

ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో చిన్న చిన్న నేరాలు సైతం ఇట్టే బయటపడుతున్నాయి. ఇక పెద్ద పెద్ద నేరాలు జరిగిన సమయంలోనూ నేరస్థులను సులభంగా పట్టుకోగలుగుతున్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని చెబుతూ ఉంటారు. ఈ విషయం పక్కన పెడితే.. కొన్నిసార్లు అదే సీసీ కెమెరాలకు పోలీసులు కూడా దొరికిపోతుంటారు. ఎవరూ చూడలేదు కదా అని.. కొన్నిసార్లు పోలీసులు చేసే పనులు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటీవల ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది.

గ్యాంగ్ రేప్ జరిగినా కుంగిపోలేదు.. ఒకప్పుడు బార్లలో డ్యాన్సులు.. ప్రస్తుతం మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్..

బీహార్ (Bihar) బఖ్రీ బజార్ పరిధి కమస్థాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి ఓ పోలీసు వాహనం.. స్థానిక కలప వ్యాపారి ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి ఓ పోలీసు (police) దిగి వ్యాపారి ఇంటి ముందున్న కలపను (Wood theft) ఎత్తుకు వచ్చి కారు వెనుక భాగంలో వేస్తాడు. మరో పోలీసు వాహనంలోనే కూర్చుని ఉంటాడు. సదరు పోలీసులు.. పలుమార్లు అటూ ఇటూ తిరిగి కలప ముక్కలను ఎత్తుకొచ్చి కారులో పడేస్తాడు. తర్వాత తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. జిల్లాలో ఇటీవల చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో పోలీసులు చలి మంట వేసుకునేందుకు కలపను ఎత్తుకెళ్లి ఉండొచ్చని అనుకుంటున్నారు. మరికొందరు.. పోలీసులు ఇలా చేయడం పద్ధతిగా లేదంటూ చర్చించుకుంటున్నారు. కలప చోరీకి సంబంధించిన ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC cameras) రికార్డు అయింది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ర్తతో మాట్లాడిన తర్వాత తండ్రికి టీ ఇచ్చిన కూతురు.. కాసేపటి తర్వాత ఆమె చేసిన పనికి.. అంతా షాక్..

Updated Date - 2023-01-04T21:06:49+05:30 IST