Shocking Video: జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తున్న కుర్రాళ్లూ.. ఈ వీడియోను తప్పకుండా ఓ లుక్కేయండి.. ఈ వ్యక్తి చేసిన ఒక్క మిస్టేక్‌తో..!

ABN , First Publish Date - 2023-05-04T20:40:17+05:30 IST

ప్రస్తుతం యువత శరీర దారుఢ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకోసం జిమ్‌లలో వివిధ రకాలుగా కసరత్తులు చేస్తుంటారు. కొందరైతే జిమ్‌లలోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. మరికొందరు అధికంగా కసరత్తులు చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొన్నిసార్లు...

Shocking Video: జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తున్న కుర్రాళ్లూ.. ఈ వీడియోను తప్పకుండా ఓ లుక్కేయండి.. ఈ వ్యక్తి చేసిన ఒక్క మిస్టేక్‌తో..!

ప్రస్తుతం యువత శరీర దారుఢ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకోసం జిమ్‌లలో వివిధ రకాలుగా కసరత్తులు చేస్తుంటారు. కొందరైతే జిమ్‌లలోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. మరికొందరు అధికంగా కసరత్తులు చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొన్నిసార్లు ఒకరు చేసే తప్పుల కారణంగా ఇంకొకరు ప్రమాదంలో పడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా అవుతోంది. జిమ్‪‌లో ఓ వ్యక్తి చేసిన మిస్టేక్‌తో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు (Viral video) కొడుతోంది. ఓ జిమ్ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు జిమ్‌లో (Gym) కసరత్తులు చేస్తుంటారు. వారిలో ఓ వ్యక్తి పడుకుని వ్యాయామం (exercise) చేస్తుండగా.. మరో వ్యక్తి నిలబడి కసరత్తులు చేస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడుతుంది. నిలబడి ఉన్న వ్యక్తి పక్కనే ఓ స్టాండ్‌కు ఉన్న రాడ్డుకు అటూ ఇటూ బరువైన ఇనుప ప్లేట్లు (weight iron plates) ఉంటాయి. నిలబడి వ్యాయామం చేస్తున్న వ్యక్తి కాసేపటి తర్వాత స్టాండ్‌కు ఓ వైపు ఉన్న ఇనుప ప్లేటును బయటికి తీస్తాడు.

20 ఏళ్ల తర్వాత అందిన సంతానం.. ఆ భార్యాభర్తలిద్దరి సంతోషం మూడు నెలల్లోనే ఆవిరి.. ఒకే ఒక్క ఘటనతో..

వెంటనే రాడ్డు ఓ వైపు గాల్లోకి లేయడంతో అటువైపు ఉన్న ఇనుప ప్లేట్లు బయటికి వచ్చి.. నేరుగా పడుకుని వ్యాయామం చేస్తున్న వ్యక్తి తలపై పడతాయి. అయితే తలపై పడే క్రమంలో సడన్‌గా వీడియో ముగుస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదేదో వైరల్ అవ్వడం కోసం చేసినట్లు ఉంది’’.. అని కొందరు, ‘‘పాపం! అతడికి ఏమైందో ఏమో’’.. అని ఇంకొందరు, ‘‘ఓ వ్యక్తి నిర్లక్ష్యం.. అమాయకుడి ప్రాణం మీదకు వచ్చింది’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‍‌ను సొంతం చేసుకుంది.

Viral News: ఫైవ్‌స్టార్ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా పాడు పని.. ఈ 23 ఏళ్ల యువతికి కోట్లలో ఆస్తి ఎలా వచ్చిందా అని ఆరా తీస్తే..!

Updated Date - 2023-05-04T20:40:17+05:30 IST