Viral Video: అమ్మ బాబోయ్! గొలుసుతో బంధించినా ఏమాత్రం తగ్గలేదు.. యజమానిని ఈ సింహం ఏం చేసిందో చూడండి..

ABN , First Publish Date - 2023-06-11T13:33:07+05:30 IST

కొందరు పులులు, సింహాలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. చిన్నపిల్లల తరహాలో వాటితో కలిసిపోయి ఆడుకుంటుంటారు. అయినా అవి మాత్రం వారికి ఎలాంటి హానీ చేయవు. సాధు జంతువుల తరహాలో సైలెంట్‌గా ఉంటాయి. అయితే అప్పుడప్పుడూ ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. కామ్‌గా ఉంటూనే..

Viral Video: అమ్మ బాబోయ్! గొలుసుతో బంధించినా ఏమాత్రం తగ్గలేదు.. యజమానిని ఈ సింహం ఏం చేసిందో చూడండి..

కొందరు పులులు, సింహాలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. చిన్నపిల్లల తరహాలో వాటితో కలిసిపోయి ఆడుకుంటుంటారు. అయినా అవి మాత్రం వారికి ఎలాంటి హానీ చేయవు. సాధు జంతువుల తరహాలో సైలెంట్‌గా ఉంటాయి. అయితే అప్పుడప్పుడూ ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. కామ్‌గా ఉంటూనే ఉన్నట్టుండి తమలోని క్రూరత్వాన్ని బయటపెడుతుంటాయి. ట్రైనర్లపై దాడులు చేసి చంపేసిన పులులు, సింహాలను చాలా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ సింహానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి సింహాన్ని (lion) గొలుసుతో బంధించి బోను నుంచి బయటికి తీసుకొస్తాడు. కాసేపు అటూ ఇటూ తిప్పుతూ సరదాగా గడుపుతాడు. సింహం కూడా సైలెంట్‌గా తన యజమానిని అనుసరిస్తూ ఉంటుంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. అప్పటిదాకా కామ్‌గా ఉన్న సింహం.. ఒక్కసారిగా చెలరేగిపోతుంది. ఆ వ్యక్తి సింహం మెడ మీద చేయి వేసి నిమురుతున్న క్రమంలో సింహాన్ని చిర్రెత్తుకొస్తుంది. గొలుసుతో బంధించడమే కాకుండా.. మళ్లీ తమాషా చేస్తున్నావా.. అన్నట్లుగా అతడిపై (Lion attack on man) దాడి చేస్తుంది.

Eggs: ఉడికించిన గుడ్లను వాసన చూసి వదిలేసిన పెంపుడు కుక్క.. అనుమానంతో ఆ యజమాని గుడ్లను కట్ చేసి చూస్తే..!

ఈ అనూహ్య ఘటనతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. గొలుసును గట్టిగా పట్టుకుని దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అయినా సింహం మాత్రం అతడిని కొరికే ప్రయత్నం చేస్తుంది. దీంతో ప్రాణ భయంతో అతను.. పక్కన ఉన్న మరో వ్యక్తిని కాపాడమని కోరతాడు. చివరకు ఇద్దరూ కలిసి ఎలాగోలా సింహాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ వీడియో అంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘సింహంతో చెలగాటం ఆడితే ఇలాగే ఉంటుంది’’.. అని కొందరు, ‘‘ఇతడి టైం బాగుండి సరిపోయింది’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వామ్మో! ఏక కాలంలో ఇదెలా సాధ్యం.. ఇతడి స్మార్ట్ వర్క్ చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు..

Updated Date - 2023-06-11T13:33:07+05:30 IST