Bride: మాంసాహారం ముట్టని అమ్మాయినే పెళ్లాడతానంటూ.. ఏళ్ల తరబడి నిరీక్షించిన కుర్రాడు.. కల నెరవేరిన తర్వాత వెరైటీగా ఉంటుందని..!

ABN , First Publish Date - 2023-06-11T10:42:26+05:30 IST

ఒక్కొక్కరికి ఒక్కో ఆశయం ఉంటుంది. కొందరు తమ ఆశయ సాధనే లక్ష్యంగా ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ పంథాని మాత్రం మార్చుకోరు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ వ్యక్తి మాంసాహారం ముట్టని అమ్మాయినే పెళ్లాడతానంటూ ఏళ్ల తరబడి నిరీక్షించాడు. ఎట్టకేలకు..

Bride: మాంసాహారం ముట్టని అమ్మాయినే పెళ్లాడతానంటూ.. ఏళ్ల తరబడి నిరీక్షించిన కుర్రాడు.. కల నెరవేరిన తర్వాత వెరైటీగా ఉంటుందని..!

ఒక్కొక్కరికి ఒక్కో ఆశయం ఉంటుంది. కొందరు తమ ఆశయ సాధనే లక్ష్యంగా ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ పంథాని మాత్రం మార్చుకోరు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ వ్యక్తి మాంసాహారం ముట్టని అమ్మాయినే పెళ్లాడతానంటూ ఏళ్ల తరబడి నిరీక్షించాడు. ఎట్టకేలకు కల నెరవేరడంతో తన ఆనందాన్ని వినూత్నంగా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇతడి వివాహానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్‌లోని ఖాండ్వా పరిధి సాయి బాగ్ కాలనీకి చెందిన అమోల్ వాధ్వానీ వివాహానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral news) మారింది. రెడీమేడ్ గార్మెంట్స్ వ్యాపారం చేస్తున్న అమోల్‌కు ఓ కోరిక ఉండేది. తాను శాఖాహారి (vegetarian) కావడంతో తనకు కాబోయే భార్య కూడా శాఖాహారిగా ఉండాలని అనుకునేవాడు. మరోవైపు పర్యావరణ పరిరక్షణపై కూడా అమోల్ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఈ క్రమంలో సైక్లింగ్ (Cycling) చేస్తూ అనేక ప్రాంతాల్లో పర్యటించి మరీ ప్రజలకు అవగాహన కల్పించేవాడు. ఇదిలావుండగా.. ఇటీవల అమోల్‌కు డింపుల్ భాటియా అనే యువతితో (young woman) పరిచయం ఏర్పడింది. డింపుల్ కూడా పూర్తి శాఖాహారి కావడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.

Daughter-in-law: నీకు దండం పెడతా అత్తా.. అని చేతులెత్తి మొక్కినా వినిపించుకోలేదు.. కోడలి జుట్టును కత్తెరతో కట్ చేసేసింది.. చివరకు..!

marriage-trending-news.gifmarriage-news.gif

ఇద్దరూ కలిసి సైక్లింగ్ చేస్తూ శాఖాహారాన్ని ప్రోత్సహించడం, పచ్చదనం, పరిశుభ్రపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జూన్ 9న అమోల్, డింపుల్ భాటియా వివాహం (marriage) .. బంధువులు, అతిథుల సమక్షంలో ఘనంగా జరిగింది. శాఖాహారినే వివాహం చేసుకోవాలన్న కోరిక నెరవేరడంతో అమోల్.. తన ఆనందాన్ని వినూత్నంగా వ్యక్తం చేశాడు. ఊరేగింపు సందర్భంగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న డింపుల్ భాటియా ఇంటికి సైకిల్‌పై చేరుకున్నాడు. వివాహానంతరం నవ దంపతులు సైకిల్ తొక్కుతూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. వీరి వివాహానికి వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది సైక్లిస్టులు హాజరయ్యారు. దీంతో అమోల్, భాటియా వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Eggs: ఉడికించిన గుడ్లను వాసన చూసి వదిలేసిన పెంపుడు కుక్క.. అనుమానంతో ఆ యజమాని గుడ్లను కట్ చేసి చూస్తే..!

Updated Date - 2023-06-11T10:42:26+05:30 IST