Viral Video: వామ్మో! ఏక కాలంలో ఇదెలా సాధ్యం.. ఇతడి స్మార్ట్ వర్క్ చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు..
ABN , First Publish Date - 2023-06-11T12:18:25+05:30 IST
కొందరు కష్టపడే విధానం చూస్తే.. అయ్యో పాపం! అని అనిపిస్తుంది. మరికొందరు చేసే పనులను చూస్తే.. అరె! ఇదెలా సాధ్యం.. అని అనిపిస్తుంటుంది. చాలా మంది తాము చేసే పనిలోనే తమ ప్రత్యేకతను చాటుకుంటుంటారు. ఇంకొందరు వివిధ విన్యాసాలు చేస్తూ చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు..
కొందరు కష్టపడే విధానం చూస్తే.. అయ్యో పాపం! అని అనిపిస్తుంది. మరికొందరు చేసే పనులను చూస్తే.. అరె! ఇదెలా సాధ్యం.. అని అనిపిస్తుంటుంది. చాలా మంది తాము చేసే పనిలోనే తమ ప్రత్యేకతను చాటుకుంటుంటారు. ఇంకొందరు వివిధ విన్యాసాలు చేస్తూ చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వ్యక్తికి సబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వైపు తింటూనే మరో వైపు ఇతడు చేసిన పని చూసి.. నెటిజన్లు అవాక్కవుతున్నారు. వామ్మో! ఏక కాలంలో ఇలాంటి పనులు ఎలా సాధ్యం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఫ్యాక్టరీలో (Factory) ఏదో తింటూ బస్తాల మిషిన్ వద్ద నిలబడి ఉంటాడు. మరోవైపు పక్కనే ఉన్న ట్రాక్ మీద ప్యాకింగ్ అయిన 50కేజీల బస్తాలు (50 kg bags) ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. బస్తా దగ్గరికి రాగానే చేతులతో ముట్టుకోకుండా స్టైల్‌గా ఇలా భుజాన్ని వంచి అలా బస్తాను పక్కన పడేస్తాడు. ఇలా వచ్చిన ప్రతి బస్తాను కేవలం భుజంతోనే కింద వరుసగా పేర్చేస్తుంటాడు. ఓవైపు తింటూనే మరో వైపు బస్తాలన్నింటినీ చక్కగా ఒకదానిమీద మరొకటి పేర్చేస్తాడు.
చూడటానికి మాత్రం అతను పని చేస్తున్నట్లు అస్సలు అనిపించదు. ఇలా ఆడుతూపాడుతూ అతడు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇలా చేయడం ఎలా సాధ్యం’’.. అంటూ కొందరు, ‘‘ఇది హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్’’.. అంటూ మరికొందరు, ‘‘ఇతడి వర్కింగ్ స్టైల్ సూపర్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో లైకులను సొంతం చేసుకుంది.