Viral Video: డైమండ్ నెక్లెస్‌ చోరీ.. సీసీటీవీ ఫుటేజీని చూసి అవాక్కైన యజమాని.. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే..!

ABN , First Publish Date - 2023-02-07T18:32:03+05:30 IST

లక్షల రూపాయల విలువ చేసే వజ్రాల హారం చోరీకి గురైంది. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీంతో ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగను పట్టుకుని తీరతామని చెప్పారు. అయితే ఇంతలో...

Viral Video: డైమండ్ నెక్లెస్‌ చోరీ.. సీసీటీవీ ఫుటేజీని చూసి అవాక్కైన యజమాని.. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే..!

లక్షల రూపాయల విలువ చేసే వజ్రాల హారం చోరీకి గురైంది. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీంతో ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగను పట్టుకుని తీరతామని చెప్పారు. అయితే ఇంతలో సీసీ టీవీ ఫుటేజీ చూసి అంతా అవాక్కయ్యారు. దీంతో ఈ కేసులో ఎలాంటి చర్యలూ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. వజ్రాల హారం చోరీకి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఈ వీడియోను మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సీనియర్ ఐపీఎస్ అధికారి (IPS officer) రాజేష్ హింగాంకర్.. తన ట్విట్టర్ (Twitter) ఖాతాలో షేర్ చేశారు. ఓ నగల దుకాణంలో ప్రదర్శనగా ఉంచిన వజ్రాల హారం చోరీకి (diamond necklace theft) గురవుతుంది. లక్షల రూపాయ విలువ చేసే హారం అవడంతో దుకాణ యజమాని కంగారుపడి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాగైనా దొంగను పట్టుకుంటామని దుకాణ యజమానికి హామీ ఇచ్చారు. అయితే దర్యాప్తులో భాగంగా నగల దుకాణంలోని సీసీ టీవీ ఫుటేజీలను (CCTV footage) పరిశీలించారు.

ఓ మహిళకు విపరీతంగా కడుపునొప్పి.. ఆపరేషన్ చేస్తూ పొట్టలో ఏముందో చూసి నోరెళ్లబెట్టిన డాక్టర్.. భర్తను పిలిచి మరీ..

చివరకు అందులోని దృశ్యం చూసి, దుకాణ యజమానితో పాటూ అంతా అవాక్కయ్యారు. హారాన్ని కొద్దిసేపు తదేకంగా చూసిన ఎలుక (rat).. మెుల్లగా దాని వద్దకు వస్తుంది. ఆహా ఎంత బావుందో అన్నట్లుగా హారాన్ని నోటితో పట్టుకుని.. అక్కడి నుంచి చెక్కేస్తుంది. ఈ దృశ్యం చూశాక.. నవ్వాలో, ఏడవాలో తెలీని పరిస్థితిలో పడిపోయాడు యజమాని. ఇంతకీ ఆ ఎలుక హారాన్ని ఏం చేసిందో, ఎక్కడ పడేసిందో కూడా తెలియరాలేదు. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ఇదేం పిచ్చిరా బాబూ.. శోభనం వీడియోను నెట్టింట పోస్ట్ చేసిన నవ దంపతులు.. మండిపడుతున్న నెటిజన్లు..!

Updated Date - 2023-02-07T18:34:38+05:30 IST