Viral Video: ఇదేం పిచ్చిరా బాబూ.. శోభనం వీడియోను నెట్టింట పోస్ట్ చేసిన నవ దంపతులు.. మండిపడుతున్న నెటిజన్లు..!

ABN , First Publish Date - 2023-02-07T16:05:29+05:30 IST

ఒక్కొక్కరికి ఒక్కో రకం పిచ్చి ఉంటుంది. సోషల్ మీడియా రాకతో కొందరి పిచ్చి ఇటీవల పీక్స్‌కు వెళ్తోంది. చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ.. ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిలో కొన్ని సందేశాత్మకంగా ఉండగా, మరికొన్ని..

Viral Video: ఇదేం పిచ్చిరా బాబూ.. శోభనం వీడియోను నెట్టింట పోస్ట్ చేసిన నవ దంపతులు.. మండిపడుతున్న నెటిజన్లు..!

ఒక్కొక్కరికి ఒక్కో రకం పిచ్చి ఉంటుంది. సోషల్ మీడియా రాకతో కొందరి పిచ్చి ఇటీవల పీక్స్‌కు వెళ్తోంది. చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ.. ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిలో కొన్ని సందేశాత్మకంగా ఉండగా, మరికొన్ని షాక్ అయ్యేలా, ఇంకొన్ని నెటిజన్లకు ఆగ్రహం తెప్పించేలా ఉంటున్నాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నవ దంపతులు తమ శోభనం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో, వీళ్లకేమైన పిచ్చా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో నవ దంపతులకు సంబంధించిన శోభనం వీడియో (bride and groom Viral videos) వైరల్‍‌గా మారింది. అందంగా అలంకరించబడిన శోభనం గదిలోకి నవ దంపతులు ప్రవేశిస్తారు. అయితే అనంతరం వీరికి విచిత్రమైన ఆలోచన వచ్చింది. అంతే వెంటనే తమ మొబైల్ ఆన్ చేశారు. వరుడు వధువును ప్రేమగా దగ్గరికి తీసుకోవడం, ముద్దులు (kisses) పెట్టుకోవడమే కాకుండా చివరకు దుస్తులు తీయడానికి సాయం చేసే ఘటనను కూడా మొబైల్‌లో రికార్డు (Mobile video recording) చేస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వీళ్లకేమైనా పిచ్చా.. అంటూ కొందరు, శోభనం సన్నివేశాలను రికార్డు చేయడం ఏంటని మరికొందరు , ఇది మంచి పద్ధతి కాదంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

అమ్మాయి పెదవులపై వంద నోటును పెట్టి.. అతడు చేసిన నిర్వాకానికి.. కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వచ్చిందంటే..

Updated Date - 2023-02-07T16:05:35+05:30 IST