Viral Video: చెత్త ఏరుకునే మహిళ వెంట నడుస్తోందో కుక్క.. ఇందులో వింతేముందనుకుంటున్నారా..? అదేం చేస్తోందో చూస్తే..!

ABN , First Publish Date - 2023-07-12T19:09:56+05:30 IST

మానవత్వం మచ్చుకైనా కనిపించని ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల కంటే జంతువులు ఎంతో మేలని అనిపిస్తుంటుంది. అందులోనూ కుక్కల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యజమానుల పట్ల వాటికి ఉన్న విశ్వాసం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఇలాంటి...

Viral Video: చెత్త ఏరుకునే మహిళ వెంట నడుస్తోందో కుక్క.. ఇందులో వింతేముందనుకుంటున్నారా..? అదేం చేస్తోందో చూస్తే..!

మానవత్వం మచ్చుకైనా కనిపించని ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల కంటే జంతువులు ఎంతో మేలని అనిపిస్తుంటుంది. అందులోనూ కుక్కల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యజమానుల పట్ల వాటికి ఉన్న విశ్వాసం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కుక్క చెత్త ఏరుకునే మహిళ వెంట నడుస్తూ వెళ్తోంది. ఇందులో వింతేముందీ.. అని అనుకుంటున్నారా.. అది చేసిన పని చూస్తే మీరే అవాక్కవుతారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. చెత్త ఏరుకునే మహిళ (woman) .. వీపున భారీ చెత్త బస్తా కట్టుకుని మోసుకుంటూ వెళ్తుంటుంది. పక్కన ఉ్న మరో బస్తాను మోసుకెళ్లలేని పరిస్థితిలో ఉంటుంది. దీన్ని గమనించిన ఆమె పెంపుడు కుక్క.. సాయం చేసేందుకు ముందుకొస్తుంది. దీంతో బస్తాకు కుక్కకు కలిపి తాడు కడుతుంది. మహిళ ముందు వెళ్తుండగా.. వెనుకే కుక్క కూడా (dog dragging garbage bag) బస్తాను ఈడ్చుకుంటూ వెళ్తుంది.

Train Fighting: ఎన్నోసార్లు రైలు ప్రయాణాలు చేసి ఉంటారు కానీ.. ఇలాంటి సీన్ మాత్రం అస్సలు చూసి ఉండరు..!

ఇలా తన యజమానురాలికి తన వంతు సాయం చేస్తుంది. ఈ ఘటనను చూసి అక్కడున్న వారంతా అవాక్కవుతున్నారు. ఈ ఘటన ఢిల్లీలో (Delhi) చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఈ కుక్కకు నిజంగా సెల్యూట్ చేయాల్సిందే’’.. అని కొందరు, ‘‘ఈ కుక్కను చూసి ఎంతో నేర్చుకోవాలి’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దుండగుడు బ్యాగు లాక్కోవడంతో.. పోతేపోనీ అని వదిలేసిన మహిళ.. అయితే ఇలా జరుగుతుందని ఇద్దరూ ఊహించలేదు..

Updated Date - 2023-07-12T19:15:03+05:30 IST