Snake Video: భయమనేది వీడి బ్లడ్‌లోనే లేదనుకుంటా.. అంత పెద్ద పామును ఒంటి చేత్తో పట్టేశాడు..!

ABN , First Publish Date - 2023-07-12T15:16:19+05:30 IST

చాలా మంది స్నేక్ క్యాచర్లు నిత్యం అనేక విష సర్పాలను పట్టుకోవడం చూస్తూ ఉంటాం. అయితే కొందరు ఎలాంటి శిక్షణ తీసుకోకుండా, జాగ్రత్తలు పాటించకుండా వివిధ రకాల సాహసాలు చేస్తుంటారు. ప్రమాదమని తెలిసినా పట్టించుకోకుండా.. చివరకు..

Snake Video: భయమనేది వీడి బ్లడ్‌లోనే లేదనుకుంటా.. అంత పెద్ద పామును ఒంటి చేత్తో పట్టేశాడు..!
king cobra

చాలా మంది స్నేక్ క్యాచర్లు నిత్యం అనేక విష సర్పాలను పట్టుకోవడం చూస్తూ ఉంటాం. అయితే కొందరు ఎలాంటి శిక్షణ తీసుకోకుండా, జాగ్రత్తలు పాటించకుండా వివిధ రకాల సాహసాలు చేస్తుంటారు. ప్రమాదమని తెలిసినా పట్టించుకోకుండా.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇంకొందరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చివరకు అనుకోని ప్రమాదాలకు గురవుతుంటారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా.. కింగ్ కోబ్రాను అవలీలగా పట్టుకున్న యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. భయమనేది వీడి బ్లడ్‌లోనే లేదనుకుంటా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు.. కింగ్ కోబ్రా (King cobra) పామును పట్టుకున్న విధానం చూసి నెటిజన్లు షాకవుతున్నారు. అటవీ ప్రాంతంలో ఓ పెద్ద కింగ్ కోబ్రా పొదల్లోకి వెళ్తూ ఓ యువకుడి కంట పడుతుంది. దీంతో పామును పట్టుకుని అందరికీ చూపించాలనే ఉద్దేశంతో సాహసం చేస్తాడు. పరుగు పరుగున వెళ్లి (young man caught king cobra) పాము తోక పట్టుకుంటాడు. దీంతో సడన్‌గా పైకి లేచిన పాము.. యువకుడిని కాటు వేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే తెలివిగా తప్పించుకుంటూ.. చివరకు పాము దృష్టిని మరల్చి పట్టుకుని పైకి ఎత్తేస్తాడు.

Birth Day Gift: ఈ యువతి పుట్టిన రోజుకు కలలో కూడా ఊహించని గిఫ్ట్.. కేక్ పక్కనే వాటిని పెట్టి మరీ సెలబ్రేషన్స్..!

పడగ విప్పిన పాము ఎదురుగా ఉన్న మరో వ్యక్తిపై బుసలు కొడుతుంది. అత్యంత పొడవైన విష సర్పం.. అంటూ పామును అందరికీ చూపించిన తర్వాత దాన్ని మళ్లీ అడవిలోకి వదిలేస్తాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ పామును చూస్తుంటేనే భయమేస్తోంది’’... అంటూ కొందరు, ‘‘భయమనేది వీడి బ్లడ్‌లోనే లేదనుకుంటా’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో లైకులను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఇంత చిన్న చెప్పు కింద.. అంత పెద్ద పాము ఎలా దాక్కుందో మీరే చూడండి.. చూడకపోయి ఉంటే..!

Updated Date - 2023-07-12T15:16:19+05:30 IST