Share News

Wife: పుట్టింటికి వెళ్లిన భార్య.. 150 సార్లు కాల్ చేసినా ఫోన్‌ లిఫ్ట్ చేయకపోవడంతో భర్తకు డౌట్.. నేరుగా అత్తారింటికి వెళ్తే..!

ABN , First Publish Date - 2023-11-12T10:08:03+05:30 IST

అనుమానం పెనుభూతమై.. ఓ భర్త చేసిన దారుణం పచ్చి బాలింత ప్రాణాలు తీసింది. 11 రోజుల పసికందుకు తల్లి లేకుండా చేసింది. కర్నాటకలో ఈ దారుణం జరిగింది.

Wife: పుట్టింటికి వెళ్లిన భార్య.. 150 సార్లు కాల్ చేసినా ఫోన్‌ లిఫ్ట్ చేయకపోవడంతో భర్తకు డౌట్.. నేరుగా అత్తారింటికి వెళ్తే..!

Wife: అనుమానం పెనుభూతమై.. ఓ భర్త చేసిన దారుణం పచ్చి బాలింత ప్రాణాలు తీసింది. 11 రోజుల పసికందుకు తల్లి లేకుండా చేసింది. కర్నాటకలో ఈ దారుణం జరిగింది. పుట్టింట్లో ఉంటున్న భార్యకు ఏకంగా 150 సార్లు ఫోన్ చేశాడు. కానీ, ఆమె లిఫ్ట్ చేయలేదు. దాంతో ఆమెపై అనుమానంతో ఏకంగా 230 కిలో దూరం ప్రయాణించి అత్తారింటికి చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం అత్తారింటి నుంచి పరారయ్యాడు. చివరికి తన సొంతూరు చేరుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో వింత ఘటన.. 82 ఏళ్ల బామ్మ నామినేషన్.. ఆమె కథేంటో తెలిస్తే కన్నీళ్లు రావడం ఖాయం..!

వివరాల్లోకి వెళ్తే.. కొలార్ జిల్లా వీర్పూరకు చెందిన కిశోర్‌కు హోసకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొలత్తూరు గ్రామానికి చెందిన ప్రతిభతో 2022 నవంబర్‌లో వివాహమైంది. కిశోర్ పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. పెళ్లైన కొత్తలో భార్యతో కిశోర్ బాగానే ఉన్నాడు. కానీ, ఆ తర్వాత నుంచి భార్యను అనుమానించడం మొదలెట్టాడు. అతడి వేధింపులు రోజురోజుకు ఎక్కువయ్యాయి. ఎప్పటికప్పుడు భార్య మొబైల్‌లోని ఫోన్ కాల్స్, సందేశాలు చెక్ చేయడం చేసేవాడు. ఏదైనా కొత్త నంబర్ కనిపిస్తే ఇక అంతే సంగతులు. ఇలా ప్రతిరోజు భార్యతో గొడవపడేవాడు. కిశోర్ వేధింపులు ఎక్కువ కావడంతో విషయం పుట్టింటి వారికి చెప్పింది ప్రతిభ. కానీ, ఆమె తల్లిదండ్రులు సర్ది చెప్పడంతో అత్తింట్లోనే ఉంది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. నెలల నిండడంతో డెలివరీ కోసం తన పుట్టింటికి వెళ్లిన ప్రతిభ ఇటీవలే పండంటి పాపకు కూడా జన్మనిచ్చింది. ఆమె పుట్టింట్లో ఉన్న కిశోర్ వేధింపులు ఆగలేదు. ఎప్పుడు ఫోన్ చేసి తిట్టడం చేసేవాడు. దాంతో ఆమె తీవ్రంగా కుమిలిపోయేది. ఆ ప్రభావం పసిపాపపై పడుతుందని ప్రతిభ తల్లి, ఇకపై కిశోర్ ఫోన్ లిఫ్ట్ చేయకు అంటూ కూతురితో చెప్పింది.

Tech News: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..? ఈ చిన్న సెట్టింగ్స్ చేసుకోండి చాలు.. అలాంటి ఫోన్‌కాల్స్ అన్నీ బంద్..!

ఈ క్రమంలో ప్రస్తుతం రామసముద్రంలోని చామరాజనగర్‌లోని చామరాజనగర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కిశోర్.. గత సోమవారం భార్య ప్రతిభకు ఏకంగా 150 సార్లు ఫోన్ చేశాడు. కానీ, ఆమె ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. దాంతో కోపంతో రగిలిపోయిన కిశోర్ తాను పనిచేసే చోటు నుంచి ఏకంగా 232 కిలోమీటర్ల దూరంలో ఉండే హోసకోటేలోని అత్తింటికి వెళ్లాడు. దాని అతుడు 5గంటలకు పైగా ప్రయాణం చేశాడు. అల్లుడు రావడం చూసిన అత్తింటివారు బాగానే మర్యాద చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పని ఉండడంతో కిశోర్ అత్తమామ బయటికి వెళ్లిపోయారు. అప్పుడు ఇంట్లో కిశోర్‌తో పాటు భార్య ప్రతిభ, 11 రోజుల పసిపాప మాత్రమే ఉన్నారు. అప్పటికే ఆమెపై కోపంతో రగిలిపోతున్న కిశోర్.. బాలింత అని కూడా చూడకుండా ప్రతిభపై చేయి చేసుకున్నాడు. ఆమె గొంతుపట్టుకుని గట్టిగా నొక్కడంతో ఊపిరాడడం లేదని తనను వదిలిపెట్టమని బతిమాలిందామె. కానీ, కిశోర్ ఆమె ప్రాణాలుపోయేవరకు గొంతు వదిలిపెట్టలేదు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె శారీతోనే ఫ్యాన్‌కు ఉరివేసేందుకు యత్నించాడు. అంతలోనే బయటికి వెళ్లిన అత్తమామలు ఇంటికి రావడం గమనించిన కిశోర్ హడావుడిగా అక్కడి నుంచి జారుకున్నాడు.

Ring Payments: చేతి వేలికి ఉన్న ఈ రింగుతోనే పేమెంట్స్.. ఏటీఎం కార్డులే కాదు పేటీఎం, ఫోన్‌పేలు కూడా అక్కర్లేదు..!

దాంతో అల్లుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ప్రతిభ తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి కూతురు విగతజీవిగా పడి ఉంది. వెంటనే వారు ఈ విషయాన్ని హోసకోటే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రతిభ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కిశోర్‌ కోసం దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో కిశోర్ తన సొంతూరు కొలార్ వచ్చేసి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన ఇంట్లో వారు వెంటనే అతణ్ని చికిత్స కోసం తమాకాలోని ఆర్ఎల్ జలప్ప ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతున్న కిశోర్‌ను హోసకోటే పోలీసులు మరో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసుల విచారణలో కిశోర్ తన భార్య ప్రతిభను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. 150 సార్లు ఫోన్ చేసిన భార్య తీయకపోవడంతో అత్తింటికి వెళ్లి ఆమెను చంపేసినట్లు పోలీసులు తెలిపారు. కిశోర్‌పై హత్య నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Wife: ఆమెకు 33 ఏళ్లు.. అతడికి 28 ఏళ్లు.. వయసులో ఐదేళ్లు చిన్నే అయినా రెండో పెళ్లి.. ఫోన్లో ముచ్చట్లే ప్రాణం తీసేశాయ్..!

Updated Date - 2023-11-12T10:08:05+05:30 IST