Share News

Wife: ఆమెకు 33 ఏళ్లు.. అతడికి 28 ఏళ్లు.. వయసులో ఐదేళ్లు చిన్నే అయినా రెండో పెళ్లి.. ఫోన్లో ముచ్చట్లే ప్రాణం తీసేశాయ్..!

ABN , First Publish Date - 2023-11-11T12:34:42+05:30 IST

కర్నాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో జరిగిన ఓ వివాహిత ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మొదట అందరు ఆమెను ఆత్మహత్య (Suicide) చేసుకుందనే భావించారు.

Wife: ఆమెకు 33 ఏళ్లు.. అతడికి 28 ఏళ్లు.. వయసులో ఐదేళ్లు చిన్నే అయినా రెండో పెళ్లి.. ఫోన్లో ముచ్చట్లే ప్రాణం తీసేశాయ్..!

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో జరిగిన ఓ వివాహిత ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మొదట అందరు ఆమెను ఆత్మహత్య (Suicide) చేసుకుందనే భావించారు. కానీ, పోస్టుమార్టం రిపోర్టులో వచ్చిన ఫలితంతో ఆమెది ఆత్మహత్య కాదు. హత్య అని తేలడంతో అందరూ షాక్ అయ్యారు. అలాగే కట్టుకున్నవాడే ఆమెను అంతమొందించాడని పోలీసుల విచారణలో బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు పరిధిలోని పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుడ్లుకు చెందిన రాజశేఖర్ (28) కు అనురాధ (33) అనే మహిళ వారు పనిచేసే పావగడలో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ఆ తర్వాత ప్రేమగా మారింది. దాంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే, అనురాధకు అంతకుముందే మరోకరితో వివాహమైంది. ఆమె మొదటి భర్త చనిపోయాడు. దీంతో ఆమె రాజశేఖర్‌కు దగ్గరకావడం, పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. ఈ దంపతులకు ప్రస్తుతం రెండు నెలల పసిబిడ్డ ఉంది.

Tech News: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..? ఈ చిన్న సెట్టింగ్స్ చేసుకోండి చాలు.. అలాంటి ఫోన్‌కాల్స్ అన్నీ బంద్..!


ఈ క్రమంలో రాజశేఖర్‌కు అనురాధ స్నేహితురాలితో పరిచయం ఏర్పడింది. ఆమెతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. తన స్నేహితురాలితో మాట్లాడొద్దని పలుమార్లు రాజశేఖర్‌తో అనురాధ గొడవ పడింది. కానీ, అతడు అవేమీ పట్టించుకోలేదు. పైగా అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అనురాధను పట్టించుకోవడం మానేశాడు. దాంతో వారి మధ్య ప్రతిరోజూ ఇంట్లో ఘర్షణ జరిగేది. ఈ క్రమంలో అక్టోబర్ 29న మరోసారి ఇదే విషయమై అనురాధ, రాజశేఖర్ మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో కోపోద్రిక్తుడైన రాజశేఖర్ భార్య గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత అదే తాడుతో ఇంట్లోనే వేలాడదీశాడు. అనంతరం తనకేమి తెలియనట్టుగా పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తన భార్య సూసైడ్ చేసుకుందని ఫిర్యాదు చేశాడు.

Ring Payments: చేతి వేలికి ఉన్న ఈ రింగుతోనే పేమెంట్స్.. ఏటీఎం కార్డులే కాదు పేటీఎం, ఫోన్‌పేలు కూడా అక్కర్లేదు..!

అతడి ఫిర్యాదుతో వెంటనే కుడ్లులోని అతని ఇంటికి వెళ్లిన పోలీసులు అనురాధ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టు (Autopsy report) లో మృతురాలి గొంతును ఊపిరాడకుండా గట్టిగా బిగించడంతోనే చనిపోయినట్లు వచ్చింది. దాంతో పోలీసులు రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించారు. పోలీసుల విచారణలో అతడు నిజం ఒప్పుకున్నాడు. అనురాధను తానే హత్య (Murder) చేసినట్టు అంగీకరించాడు. ఆమె స్నేహితురాలితో తాను ఫోన్‌లో మాట్లాడుతుండడం నచ్చక గొడవ పడేదని, అక్టోబర్ 29న కూడా ఇదే విషయమై తమ మధ్య ఘర్షణ చోటు చేసుకుందని తెలిపాడు. ఆ సమయంలో తన చేతికి అందిన తాడును ఆమె గొంతుకు బిగించి చంపేసినట్లు చెప్పాడు. ఆ తర్వాత అదే తాడుతో వేలాడదీసి, ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించానని పోలీసులతో తెలిపాడు. రాజశేఖర్‌పై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Shocking: ఓ నిండు గర్భిణికి సిజేరియన్ ఆపరేషన్.. బయటకు వచ్చిన శిశువును చూసి అవాక్కైన డాక్టర్లు.. వైద్య చరిత్రలోనే..!

Updated Date - 2023-11-11T12:34:43+05:30 IST