Share News

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో వింత ఘటన.. 82 ఏళ్ల బామ్మ నామినేషన్.. ఆమె కథేంటో తెలిస్తే కన్నీళ్లు రావడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-11-12T08:47:40+05:30 IST

తెలంగాణ ఎన్నికలలో భాగంగా ఈ నెల 10వ తేదీతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ నామినేషన్ ప్రక్రియలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో వింత ఘటన.. 82 ఏళ్ల బామ్మ నామినేషన్.. ఆమె కథేంటో తెలిస్తే కన్నీళ్లు రావడం ఖాయం..!

Telangana Elections: తెలంగాణ ఎన్నికలలో భాగంగా ఈ నెల 10వ తేదీతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ నామినేషన్ ప్రక్రియలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం (Jagtial Assembly constituency) లో 82 ఏళ్ల ఓ బామ్మ మంగళవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. కానీ, ఆమె ఏదో ఎమ్మెల్యే అయిపోదామని మాత్రం కాదు. ఇంకా చెప్పాలంటే రాజకీయాలతో ఆమెకు ఎలాంటి సంబంధం కూడా లేదు. అసలు ఆమె ఈ నామినేషన్ దాఖలు చేయడానికి కారణం వేరే ఉంది. నిజానికి ఆమె కథేంటో తెలిస్తే కన్నీళ్లు రావడం ఖాయం.

Tech News: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..? ఈ చిన్న సెట్టింగ్స్ చేసుకోండి చాలు.. అలాంటి ఫోన్‌కాల్స్ అన్నీ బంద్..!

వివరాల్లోకి వెళ్తే.. ఆమె పేరు చీట్టి శ్యామల (Cheeti Shyamala). జగిత్యాల నియోజకవర్గం పరిధిలో గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో నివాసం ఉంటారు. అయితే, ఇటీవల ఆమె పెద్ద కుమారుడు శ్రీనివాస రావు కుటుంబ ఆస్తుల విషయమై తనపై కోర్టు కేసు వేసినట్లు బామ్మ చెప్పారు. ఆమెపై పేరుపై ఉన్న ఆస్తిలో ఇంకా తనకు వాటా కావాలంటూ తల్లి ఉంటున్న ఇంటిపై కన్నేశాడు. ఆ ఇంట్లో ఉండేందుకు వీల్లేదని, కిరాయి ఇంట్లో ఉండాలని ఇబ్బంది పెడుతున్నాడట. కానీ, ఆమె వృద్ధురాలు కావడం, పైగా ఒంటరిగా ఉండడంతో ఆమెకు ఎవరు ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదు.

Ring Payments: చేతి వేలికి ఉన్న ఈ రింగుతోనే పేమెంట్స్.. ఏటీఎం కార్డులే కాదు పేటీఎం, ఫోన్‌పేలు కూడా అక్కర్లేదు..!

సొంత నివాసంలో ఉండలేక అద్దె ఇంట్లో ఉండేలా ఒత్తిడి చేశారని స్వాతంత్య్ర సమరయోధుడు మురళీధర్ రావు భార్య శ్యామల ఆరోపించారు. తన సమస్య పరిష్కారం కోసం పలువురిని కలిసిన ఎక్కడ తనకు న్యాయం జరగలేదని ఆమె వాపోయారు. ఇలాగైన తన సమస్య అందరికీ తెలుస్తుందని ఆమె అన్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి సమాజానికి చెప్పేందుకు, తన ఇంటిని తిరిగి పొందేందుకు సహకరించాలని అధికారులను అభ్యర్థిస్తూ నామినేషన్ దాఖలు చేసినట్లు ఆమె తెలిపారు.

Wife: ఆమెకు 33 ఏళ్లు.. అతడికి 28 ఏళ్లు.. వయసులో ఐదేళ్లు చిన్నే అయినా రెండో పెళ్లి.. ఫోన్లో ముచ్చట్లే ప్రాణం తీసేశాయ్..!

Updated Date - 2023-11-12T08:47:41+05:30 IST