Viral Video: వీడెవడండీ బాబూ.. బైక్‌ను డ్రైవ్ చేసుకుంటూ నేరుగా నదిలోకే వెళ్లిపోయాడని అవాక్కవుతున్నారా..? కానీ అతడెందుకలా వెళ్లాడో చూస్తే..

ABN , First Publish Date - 2023-04-08T14:09:19+05:30 IST

సోషల్ మీడియా (Social Media) పుణ్యమా అని ఎన్నో వైరల్ వీడియోలు (Viral Videos) నిమిషాల్లో ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నాయి.

Viral Video: వీడెవడండీ బాబూ.. బైక్‌ను డ్రైవ్ చేసుకుంటూ నేరుగా నదిలోకే వెళ్లిపోయాడని అవాక్కవుతున్నారా..? కానీ అతడెందుకలా వెళ్లాడో చూస్తే..

Viral Video: సోషల్ మీడియా (Social Media) పుణ్యమా అని ఎన్నో వైరల్ వీడియోలు (Viral Videos) నిమిషాల్లో ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నాయి. కొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటే.. మరికొన్ని కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు కన్నీరు పెట్టించేలా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. ఇదే కోవలో తాజాగా ఓ బైక్ రైడర్‌కు సంబంధించిన వీడియో ఒకటి బాగా హల్‌చల్ చేస్తుంది. వీడియో చూస్తే.. "వీడెవడండీ బాబూ.. బైక్‌ను డ్రైవ్ చేసుకుంటూ నేరుగా నదిలోకే వెళ్లిపోతున్నాడు" అనుకుంటాం. కానీ అతడెందుకలా వెళ్లాడో వీడియో చివరి వరకు చూస్తే గాని అర్థం కాదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Anupama Parameswaran: లుక్స్‌తో మైమరిపిస్తోన్న అందాల అనుపమ.. వావ్ అనాల్సిందే..!

వీడియోను మోటార్ ఓక్టేన్ (Motor Octane) అనే ట్విటర్ పేజీ ద్వారా షేర్ చేశారు. ఓ వ్యక్తి నది ఒడ్దుపై నుంచి నేరుగా బైక్ డ్రైవ్ చేసుకుంటూ లోపలికి వెళ్లడం మనం వీడియోలో చూడొచ్చు. నదిలో మోకాళ్లలోతు నీరు కూడా పారుతుంది. అందులో ఆ వ్యక్తి ఏదో రోడ్డుపై బైక్ రైడ్ చేస్తు్న్నట్లు తాపీగా వెళ్తుండడం వీడియోలో ఉంది. వీడియో చూస్తే వామ్మో.. అనిపించకమానదు. అలా అతడు బైక్‌పై వెళ్లి అవతలి వైపు ఉన్న ఓ ఫుట్‌పాత్ బ్రిడ్జిపై ఎక్కడం మనం చూడొచ్చు. ఇక మోటార్ ఓక్టేన్ ట్విటర్ పేజీ వారు.. "ఈ వీడియోకు మనసు ఉంటే మార్గం ఉంటది. ఒక్కసారి ఆలోచించండి. ఇది చాలా స్మార్టా? లేక రిస్కీనా?" అనే క్యాప్షన్ జోడించారు. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు ఐదున్నర లక్షల మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 'ఇది చాలా రిస్కీ. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఇంజిన్‌లో వాటర్ పోతే పరిస్థితి ఏంటి?' అని ఒకరు, 'అక్కడి స్థానికులకు నది గురించి బాగా తెలుసు. వారు చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగారు. అస్సాంలో ఇలాంటివి కామన్' అని మరోకరు రాసుకొచ్చారు.

Viral Video: నీకు హ్యాట్సాఫ్ బ్రదర్.. రోడ్డు పక్కన టేబుల్ వేసి.. అన్నం కూరలు అమ్ముతున్న ఈ కుర్రాడెవరో.. అతడి కథేంటో తెలిస్తే..

Raashi Khanna: గులాబీ డ్రస్‌లో గ్లామర్ షోతో కవ్విస్తోన్న రాశీ ఖన్నా..!


Updated Date - 2023-04-10T11:32:48+05:30 IST