Husband: 11 బస్తాల్లో 10 రూపాయల నాణేలు.. నేరుగా కోర్టుకే తెచ్చిచ్చిన భార్యపై వెరైటీగా కసి తీర్చుకున్న భర్త..!

ABN , First Publish Date - 2023-04-20T14:49:33+05:30 IST

భార్య మీద కోపంతోనూ.. ఇంకేంటో తెలియదు గానీ.. ఏకంగా చిల్లర నాణేలను తీసుకొచ్చి షాకిచ్చాడు.

Husband: 11 బస్తాల్లో 10 రూపాయల నాణేలు.. నేరుగా కోర్టుకే తెచ్చిచ్చిన భార్యపై వెరైటీగా కసి తీర్చుకున్న భర్త..!
Husband:

భార్యాభర్తల అన్నాక చిన్న చిన్న గొడవలు.. మనస్పర్థలు రావడం సహజం. అవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్‌లాంటివి. ఇలా వస్తుంటాయి.. అలా పోతుంటాయి. ఒకరికొకరు సర్దుకుపోవడమే కుటుంబం అంటే. అందుకే పెద్దలంటుంటారు.. పెళ్లంటే నూరేళ్ల పంట అని. అలా కాకుండా పంతాలకు పోతే జీవితాలు నాశనం అయిపోతాయి.

వారిద్దరూ భార్యాభర్తలు. అభిప్రాయభేదాలతో ఇద్దరూ విడిపోయారు. భర్త నుంచీ భరణం ఇప్పించాలంటూ భార్య కోర్టు మెట్టులెక్కింది. అంతే భార్య మీద కోపంతోనూ.. ఇంకేంటో తెలియదు గానీ.. ఏకంగా చిల్లర నాణేలను తీసుకొచ్చి షాకిచ్చాడు. దీంతో భార్యతో పాటు కోర్టు సిబ్బంది షాక్ అయ్యారు. ఈ సంఘటన తమిళనాడులోని సేలం కోర్టులో జరిగింది.

సేలం జిల్లాకు చెందిన రాజీ (57) అనే వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్య శాంతి. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడివిడిగా జీవిస్తున్నారు. దీంతో భర్త నుంచి భరణం రాబట్టేందుకు శాంతి సంగగిరి 2వ క్రిమినల్ కోర్టులో కేసు వేసింది. విచారించిన న్యాయమూర్తి.. శాంతికి ప్రతీ నెలా రూ.73,000 జీవన భృతి చెల్లించాలని ఆదేశించారు.

న్యాయస్థానం ఆదేశించినా రాజీ మాత్రం పట్టించుకోకుండా భరణాన్ని ఎగ్గొట్టాడు. భరణాన్ని సరిగ్గా చెల్లించకపోవడంతో శాంతి మరోసారి సంగగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారించిన జడ్జి.. బకాయి మొత్తాన్ని రూ.2.18 లక్షలు వెంటనే చెల్లించాలని రాజీకి ఆదేశించారు.

case-2.jpg

ఇక చేసేదేమీలేక బుధవారం ఉదయం రాజీ తన భార్యకు చెల్లించాల్సిన భరణాన్ని రూ.2.18 లక్షలను రూ.10 నాణేలను 11 బస్తాల్లో వేసుకుని కోర్టుకు తీసుకొచ్చాడు. దీంతో కోర్టు సిబ్బంది అవాక్కయ్యారు. భార్యకు చెల్లించాల్సిన సొమ్మును చిల్లర రూపంలో తీసుకొచ్చి ఆమెను అవమానపరిచాడని కోర్టు సిబ్బంది రాజీపై మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: ఈ రోజు మందు ఫ్రీ.. అనే బోర్డును చూసి క్లబ్‌లోకి వెళ్లాడో వ్యక్తి.. చివరకు అతడి శవమే బయటకు వచ్చింది.. అసలేం జరిగిందంటే..!


ఇది కూడా చదవండి: Viral Video: అమ్మ బాబోయ్.. ఇదేం వింత.. గాల్లోకి ఎగురుతున్న పాములు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..!

ఇది కూడా చదవండి: Viral News: పండ్ల మార్కెట్లో కూలి పనిచేస్తున్న ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి విస్తుపోయిన పోలీసులు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన..!

Updated Date - 2023-04-20T14:49:33+05:30 IST