Viral Video: అమ్మ బాబోయ్.. ఇదేం వింత.. గాల్లోకి ఎగురుతున్న పాములు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..!

ABN , First Publish Date - 2023-04-19T15:55:19+05:30 IST

మీరెప్పుడైనా పాములు ఎగరడం చూశారా? కనీసం ఆ మాటైనా ఎప్పుడైనా విన్నారా? లేదంటే పెద్దోళ్లైనా ఎప్పుడైనా చెప్పారా?. అంతకీ కాదంటే పాఠ్యాంశాల్లోనైనా ఎప్పుడైనా చదివారా? ఈ మాటలు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి కదూ? కానీ

Viral Video: అమ్మ బాబోయ్.. ఇదేం వింత.. గాల్లోకి ఎగురుతున్న పాములు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..!
Viral Video

మీరెప్పుడైనా పాములు ఎగరడం చూశారా? కనీసం ఆ మాటైనా ఎప్పుడైనా విన్నారా? లేదంటే పెద్దోళ్లైనా ఎప్పుడైనా చెప్పారా?. అంతకీ కాదంటే పాఠ్యాంశాల్లోనైనా ఎప్పుడైనా చదివారా? ఈ మాటలు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి కదూ? కానీ మీరు చదువుతోంది..? మీరు వింటోంది నిజమే. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది.

సహజంగా పాములను చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. అంతెందుకు కొంతమందికి దాని పేరు వింటేనే గుండెల్లో దడపుడుతోంది. స్నేకే కాదు.. చిన్న చిన్న పురుగులను చూసినా భయపడుతుంటారు. అలాంటిది పాములు కూడా పక్షుల్లా ఎగురుతాయంటే ఎలా ఉంటుంది. తాజాగా వైరల్ (Viral Video) అవుతున్న ఈ వీడియో చేస్తే అయ్యో బాబోయ్.. అనాల్సిందే.

ఇంటర్నెట్‌ (internet)లో ఈ పాముకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. దాదాపు 11 అడుగుల పొడవున్న ఈ పాము.. ఎలా ఎగిరి (Flying snakes) వేటాడుతుందో ఈ వీడియోలో కళ్లకు కట్టినట్టు చూపించారు.

snkae-2.jpg

ఈ ఎగిరే పామును బంగారు చెట్టు పాము అంటారు. ఇదొక విషపూరిత పాము. ఈ పాములు దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలో ఎక్కువగా ఉంటాయి. ఈ పాములు సన్నగా పొడవుగా ఉంటాయి. నలుపు క్రాస్ చారలు కలిగి పసుపు, ఎరుపు రంగులు కలిగి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ పాము తన నోటి వెనుక భాగంలోని కోరల నుంచి విషంతో కలిపిన తేలికపాటి లాలాజలాన్ని విడిచిపెడుతుంది. దీంతో ఎరను పట్టుకుని వాటిని కదలనీయకుండా చేస్తుంది.

ఈ భయానక వైరల్ వీడియోలో పాము పక్షిలా ఎగురుతూ ఎలా వేటాడుతుందో అందరినీ షాక్ అయ్యేలా చేసింది. డిస్కవరీ యూకే ఈ వీడియోను య్యూటూబ్‌లో షేర్ చేసింది. దీన్ని వేల సంఖ్యలో వీక్షించారు. లైక్‌లు కూడా ఇచ్చారు. ఈ దృశ్యాలతో షాక్ తిన్న నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

ఇది కూడా చదవండి: Viral News: పండ్ల మార్కెట్లో కూలి పనిచేస్తున్న ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి విస్తుపోయిన పోలీసులు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన..!

Updated Date - 2023-04-19T16:08:45+05:30 IST