Viral News: పండ్ల మార్కెట్లో కూలి పనిచేస్తున్న ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి విస్తుపోయిన పోలీసులు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన..!

ABN , First Publish Date - 2023-04-19T14:31:10+05:30 IST

అతడో ఉన్నత విద్యావంతుడు. అంతేకాదు.. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ సన్మార్గంలో నడిపించే గురువు. ఓ కార్పొరేట్ స్కూల్‌లో మంచి పోస్టింగ్. మంచి తెలివి.. జ్ఞానం కలిగిన వాడు

Viral News: పండ్ల మార్కెట్లో కూలి పనిచేస్తున్న ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి విస్తుపోయిన పోలీసులు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన..!
Viral News

అతడో ఉన్నత విద్యావంతుడు. అంతేకాదు.. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ సన్మార్గంలో నడిపించే గురువు. ఓ కార్పొరేట్ స్కూల్‌లో మంచి పోస్టింగ్. మంచి తెలివి.. జ్ఞానం కలిగిన వాడు. చేతినిండా డబ్బులు. కావాలంటే విలాసవంతంగా జీవిస్తూ జల్సాలు చేయొచ్చు. కానీ సడన్‌గా ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. ఉన్నట్టుండి ఆ గుంపుల మధ్య కనిపించే సరికి పోలీసులు షాక్‌కు గురయ్యారు. అసలేమైంది? ఆ పండితుడు అలా మారిపోవడానికి కారణమేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

మనిషి అన్నాక.. కష్టాలుండవా? ఇబ్బందులుండవా? ప్రతీ మనిషికి ఏదొక సమస్య ఉంటూనే ఉంటుంది. దాన్ని అధిగమించి ముందుకుపోతే అన్నీ సమసిపోతాయి. అందుకే జీవితమంటే ఒక రైలు ప్రయాణం లాంటిది. మధ్య.. మధ్యలో ఎన్ని సార్లు ఆగినా గమ్యం చేరుకుంటుంది. జీవితం కూడా అలాంటిదే అంటారు మానసిక నిపుణులు.

ఆ యువకుడు హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా (Assistant Professor) పని చేస్తున్నాడు. హాస్టల్‌లో ఉంటూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న సమయంలో వ్యక్తిగత జీవితంపై విరక్తి చెందాడు (Personal Life). అంతే ఉన్నట్టుండి హాస్టల్ నుంచీ అదృశ్యమయ్యాడు. ఎవరికీ కనిపించకుడా 10 రోజుల పాటు రహస్యంగా హమాలీ పనులు (Hamali Work) చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంకోవైపు అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు నగరంలో పలు ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ట పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే యువకుడ్ని గుర్తించి ఫ్యామిలీ చెంతకు చేర్చారు.

తెలంగాణలోని ఖమ్మంకు చెందిన ఓ యువకుడు ఉన్నత విద్యను అభ్యసించాడు. బతుకుతెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. దీంతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తూ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 7 (ఏప్రిల్)న వసతి గృహం నుంచీ ఎవరికీ చెప్పకుండా మాయమైపోయాడు. అతని సమాచారం లేకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఖమ్మం నుంచీ హుటాహుటిన... హైదరాబాద్ చేరుకుని తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం (ఏప్రిల్ 17) అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పై అధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసుల బృందం యువకుడి కుటుంబ సభ్యుల నుంచీ.. హాస్టల్‌లోని సహచర విద్యార్థుల నుంచీ వివరాలు సేకరించి వెతకడం ప్రారంభించారు.

st.jpg

ఇదిలా ఉంటే గతంలోనూ యువకుడు ఇంట్లో నుంచీ వెళ్లి కూలి పనులు చేసినట్లు పోలీసులు సమాచారం సేకరించారు. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఖాకీలు.. పండ్ల మార్కెట్ ప్రాంతంలో యువకుడు ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. అంతే మంగళవారం తెల్లవారుజామున మార్కెట్‌కు ఆయా పనుల కోసం వచ్చే కూలీల మీద నిఘా పెట్టారు. అంతే వారు ఊహించిందే నిజమైంది. పోలీసులు ఊహించినట్లే అతడు మార్కెట్‌లోకి హమాలీ పనుల కోసం వచ్చాడు. అక్కడే ఓ స్థలంలో పని చేస్తుండగా పోలీసులు గుర్తించి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 12 గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించి శెభాష్ అనిపించుకున్నారు. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి: Fridge: మామిడి పండ్లను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా..? తినే ముందు ఈ ఒక్క పని చేయడం మాత్రం మర్చిపోకండి..!

Updated Date - 2023-04-19T14:58:54+05:30 IST