Viral Video: 8 ఏళ్లుగా అన్నయ్యా అని పిలిచి.. చివరకు అతడినే పెళ్లి చేసుకుందట.. ఘాటు కామెంట్స్‌తో నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదుగా..!

ABN , First Publish Date - 2023-04-15T16:40:02+05:30 IST

మన కంటే వయసులో పెద్దవారు ఉంటే మనం వారిని కామన్‌గా పురుషుడైతే 'అన్న' అని, మహిళ అయితే 'అక్క' అని పిలుస్తుంటాం.

Viral Video: 8 ఏళ్లుగా అన్నయ్యా అని పిలిచి.. చివరకు అతడినే పెళ్లి చేసుకుందట.. ఘాటు కామెంట్స్‌తో నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదుగా..!

ఇంటర్నెట్ డెస్క్: మన కంటే వయసులో పెద్దవారు ఉంటే మనం వారిని కామన్‌గా పురుషుడైతే 'అన్న' అని, మహిళ అయితే 'అక్క' అని పిలుస్తుంటాం. అదే మన బంధువులు అయిన అలాగే పిలుస్తాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామనేగా మీ అనుమానం. ప్రస్తుతం నెట్టింట ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. అందులో ఓ జంట తమను తాము పరిచయం చేసుకుంటూ ఓ విషయం చెప్పారు. ఆమె పెళ్లికి ముందు ఎనిమిదేళ్లు భర్తను 'అన్నయ్య' అని పిలిచిందట. ఆ తర్వాత అతడ్నే పెళ్లి చేసుకుని భార్యనయ్యానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు ఘాటు కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు.

'వినీ అండ్ జై' (Vini and Jai) అనే ఇన్‌స్టాగ్రాం (Instagram) పేజీలో ఈ వీడియో పోస్ట్ అయింది. వీడియోలో ఆ జంట వారి పాత ఫొటోలను చూపించింది. అలా ఫొటోలు చూపిస్తూ విన్నీ తన భర్త జై గురించి మాట్లాడింది. తాము రిలేటివ్స్ అని. తమ ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ కారణంగా జైను తాను అన్నయ్యగా పిలిచినట్లు ఆమె చెప్పింది. అలా ఎనిమిదేళ్లు 'భయ్యా' అనే పిలిచిందట. ఆ తర్వాత అతడ్నే పెళ్లాడి ఇప్పుడు భార్యనయ్యానని తెలిపింది. ఇప్పుడు తమకు ఓ సంతానం కూడా ఉందని చెప్పుకొచ్చింది. ఈ వీడియో "మేము బంధువులం. మా వయస్సు గ్యాప్ కారణంగా నేను అతనిని చాలా సంవత్సరాలు భయ్యా అని పిలిచాను. ఇప్పుడు ఆ భయ్యే భర్తయ్యాడు." అనే క్యాప్షన్ ఇచ్చారు.

Viral Video: ఎన్ని సార్లు అడిగినా ముఖానికి చుట్టుకున్న స్కార్ఫ్‌ను తీసేయని ప్రేయసి.. అనుమానంతో ఆ ప్రియుడు ముసుగు తీసేసి చూస్తే..

ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 5 మిలియన్ల వ్యూస్, 2.52లక్ష లైక్స్ వచ్చిపడ్డాయి. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. "ఇది జోక్ కాదు కదా. నాకు చాలా వింతగా అనిపిస్తుంది" అని ఒకరు, "అన్నయ్యని పిలవడం రిలేషన్‌షిప్ కాదు! నీకంటే పెద్ద వాడిని బ్రదర్ అని పిలవవచ్చు! కానీ లోకానికి చెప్పాల్సిన అవసరం లేదు. అంతగా నచ్చలేదు." అని మరోకరు ఘాటు కామెంట్ చేశారు.

Viral Video: ఆమెతో మాట్లాడాలి.. ఎవరైనా వెళ్లి నాకు ఫోన్ చేయించండంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఇంతకీ ఈమె ఎవరంటే..!

Updated Date - 2023-04-15T16:40:02+05:30 IST