JrNTR: టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ ని కలిసిన జూనియర్ ఎన్ఠీఆర్

ABN , First Publish Date - 2023-01-17T12:36:43+05:30 IST

న్యూజిలాండ్ టీం తో వన్ డే క్రికెట్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ఆడటానికి వచ్చిన టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ కొంతమందిని జూనియర్ ఎన్ఠీఆర్ కలిసాడు.

JrNTR: టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ ని కలిసిన జూనియర్ ఎన్ఠీఆర్
Some of the Team India cricket players with Jr NTR

జూనియర్ ఎన్ఠీఆర్ (Jr NTR) 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమా అవార్డుల కోసం, అలాగే విరామం కూడా తీసుకొని విదేశాల నుండి తిరిగి హైదరాబాద్ వచ్చేసాడు. అయితే ఇక్కడ కూడా అతను బిజీ బిజీ గా వున్నాడు. న్యూజిలాండ్ టీం తో వన్ డే క్రికెట్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ఆడటానికి వచ్చిన టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ కొంతమందిని జూనియర్ ఎన్ఠీఆర్ కలిసాడు. (Team India cricket players met Jr NTR at Nazeer Khan's house) ఇందులో సూర్యకుమారి యాదవ్(Suryakumar Yadav), శుబ్ మన్ గిల్ (Shubman Gill), ఇషాన్ కిషన్ (Ishan Kishan), యుజువేంద్ర చహల్ (Yuzvendra Chahal), శార్దుల్ ఠాకూర్ (Shadrul Thakur) ఇంకా కొంతమంది వున్నారు. టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ కొందరికి నజీర్ ఖాన్ (Nazeer Khan) మంచి స్నేహితుడు అవటం వలన, అతని ఇంటికి వచ్చారు వీరందరూ. అదే నజీర్ ఖాన్ జూనియర్ ఎన్ఠీఆర్ కి కూడా స్నేహితుడు కావటం వాళ్ళ, అక్కడకి వచ్చి ఈ ప్లేయర్స్ కలిసినట్టుగా సమాచారం. (Indian cricket team is in Hyderabad to play a one day match against New Zealand at Uppal Stadium)

team-india2.jpg

జూనియర్ ఎన్ఠీఆర్ పాట 'నాటు నాటు' (#NatuNatu song) కి ఈమధ్యనే అంతర్జాతీయంగా అవార్డులు రావటం, ఈ క్రికెట్ ప్లేయర్స్ అందరూ జూనియర్ ఎన్ఠీఆర్ కి తమ శుభాకాంక్షురాలు చెప్పినట్టు సమాచారం. అలాగే జూనియర్ ఎన్ఠీఆర్ సూర్యకుమార్ యాదవ్ తో ఎక్కువ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సూర్యకుమారి ఈమధ్య టీ20 లో చేసిన శతకం గురించి జూనియర్ ఎన్ఠీఆర్ ప్రస్తావించినట్టుగా తెలిసింది. అలాగే మిగతా క్రికెట్ ప్లేయర్స్ తో కూడా జూనియర్ ఎన్ఠీఆర్ పిచ్చాపాటీ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. క్రికెట్ ప్లేయర్స్ జూనియర్ ఎన్ఠీఆర్ తదుపరి చిత్రం గురించి (#NTR30) అడిగి తెలుసుకున్నారని కూడా తెలిసింది. ఆస్కార్ బరిలో 'ఆర్.ఆర్.ఆర్.' వుంది ఈసారి అవార్డు వస్తుంది అని ప్లేయర్స్ జూనియర్ ఎన్ఠీఆర్ తో చెప్పినట్టు, అందుకు ముందుగానే శుభాకాంక్షలు కూడా చెప్పారని తెలిసింది.

ఈ నజీర్ ఖాన్ గతంలో ఖరీదైన కార్ కలెక్షన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇతను హైదరాబాద్ లో ఉంటాడు, ఇలాంటి సెలబ్రిటీ డిన్నర్ లు ఏర్పాటు చేస్తూ ఉంటాడు అని తెలిసింది. అందుకే అతని ఇంట్లోనే వీళ్ళందరూ కలిసినట్టుగా తెలిసింది. (Nazeer Khan is a good friend to many Indian cricketers and also Jr NTR) #JrNTR #NTR30 #TeamIndia

Updated Date - 2023-01-17T12:36:44+05:30 IST