తప్పు వరుడిదే.. సారీ చెబుతామన్నా వినని వధువు.. నాకీ పెళ్లి వద్దంటూ తేల్చేసింది.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-02-15T14:22:55+05:30 IST

కాబోయే వాడ్ని ఊహించుకుంటూ ఆమె మురిసిపోయింది. ఇదంతా జరుగుతుండగానే ఊహించని షాకిచ్చింది పెళ్లి కూతురు. ఏం జరిగిందో ఏంటో తెలుసుకొనే లోపే

తప్పు వరుడిదే.. సారీ చెబుతామన్నా వినని వధువు..  నాకీ పెళ్లి వద్దంటూ తేల్చేసింది.. అసలేం జరిగిందంటే..
సారీ చెబుతామన్నా వినని

సహజంగా పెళ్లంటేనే ఎంతో హడావుడి. బంధుమిత్రుల రాకపోకలతో సందడి.. సందడిగా ఉంటుంది. ఇక కోటి ఆశలతో.. ఎన్నో కలలతో కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ పెళ్లి కూతురుగా ముస్తాబైంది. ఓ వైపు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు. మరోవైపు పూల డెకరేషన్‌తో విద్యుత్ కాంతులతో, మేళతాళాలతో వివాహ ప్రాంగణం కళకళలాడుతోంది. ఇంకోవైపు భాజాభజంత్రీలు, డ్యాన్సులు, కేరింతలతో సందడి. కొన్ని గంటల్లో వధూవరులు పెళ్లిపీఠాలు ఎక్కాల్సి ఉంది. మూడుముళ్లు, ఏడు అడుగులతో దంపతులై కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. చక్కని ఏర్పాట్లు. ఎటు చూసినా హడావుడి.. సందడి. కాబోయే వాడ్ని ఊహించుకుంటూ ఆమె మురిసిపోయింది. ఇదంతా జరుగుతుండగానే ఊహించని షాకిచ్చింది పెళ్లి కూతురు. ఏం జరిగిందో ఏంటో తెలుసుకొనే లోపే అంతా అయోమయం.. గందరగోళం. వచ్చిన బంధుమిత్రులు, స్నేహితులు ఎవరిదారిన వారు ఇంటికి వెళ్లిపోయారు. ఇక ఇచ్చుపుచ్చుకున్న కానుకల సైతం తిరిగి తీసేసుకున్నారు. వధూవరులిద్దరూ ఎవరిదారిన వారు వెళ్లిపోవడం అంతా చకచక జరిగిపోయింది. ఇంతకీ ఏం జరిగిందనే కదా? మీ డౌట్. అయితే ఈ వార్త చదవాల్సిందే.

పెళ్లి (Wedding)చేసుకునేవారికి ఎన్నో ఊహలుంటాయి. కాబోయే వాడు అలా ఉండాలని.. ఇలా ఉండాలని అమ్మాయిలు అనుకుంటారు. అలాగే అబ్బాయిలు కూడా కాబోయే భార్య (wife) అలా ఉండాలని.. ఇలా ఉండాలని ఊహా లోకంలో విహరిస్తుంటారు. ఇక పెద్దలు కూడా సంబంధాలు చూసేటప్పుడే మంచి భర్త (husband) రావాలని అమ్మాయి తల్లిదండ్రులు (Parents).. మంచి కోడలు ఇంటికి రావాలని అబ్బాయి తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. ఇరు కుటుంబాలు అన్ని వివరాలు తెలుసుకునే పెళ్లికి సిద్ధమవుతారు. అలానే ఓ జంట పెళ్లికి సిద్ధమైంది. మరి కొన్ని గంటల్లో వధువు మెడలో వరుడు తాళి కడితే వివాహ బంధం(Marriage)లోకి అడుగు పెడతారు. ఇంత వరకూ బాగానే సాగింది. అయితే పెళ్లికి ఒకరోజు ముందే ఇరు కుటుంబాలు విందు ఏర్పాటు చేసుకున్నాయి. ముందుగా వధువు కల్యాణ మండపానికి (Kalyana Mandapam) చేరుకుంది. ఆ తర్వాత వరుడు కూడా చేరుకున్నాడు. అంతే సీన్ క్షణాల్లో మారిపోయింది. అప్పటి దాకా సందడిగా సాగిన తంతు గందరగోళంతో గలిబిలి అయిపోయింది. కొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వధూవరులు ఎవరిదారిన వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: మరీ ఇంత దారుణమా..? తినడానికి తిండి లేక భర్త, తల్లి మృతి.. అంత్యక్రియలకు డబ్బుల్లేకపోవడంతో ఆ భార్య ఏం చేసిందంటే..

తమిళనాడు (Tamil Nadu)లోని చెంగల్పట్టు జిల్లా తిరుపోరూర్‌ సమీపం మాంబాక్కం ప్రాంతానికి చెందిన యువకుడికి, మేలకోట్టయూర్‌కు చెందిన యువతికి వివాహం చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. సోమవారం వివాహం జరగాల్సి ఉండగా.. ఆదివారం రాత్రి రిసెప్షన్‌ (Reception) ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వరుడు మద్యం (Alcohol)సేవించాడని వధువు గుర్తించి అతడిని నిలదీయడంతో రెండు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. ఈ వ్యవహారంపై రగడ మరింత ముదరడంతో వధువు కుటుంబ సభ్యులు వెంటనే తాళంబూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పెళ్లి మండపానికి చేరుకుని విచారణ జరిపారు. మరోవైపు వరుడు తప్పు చేశాడని, అతని తరఫున తాము క్షమాపణ చెబుతున్నామని ఆయన కుటుంబసభ్యులు ఎంత బతిమాలినా వధువు అంగీకరించలేదు. తామిచ్చిన నగదు, నగలు వెంటనే తిరిగివ్వాలని ఆమె వరుడు కుటుంబసభ్యులను నిలదీసింది. ఇంకోవైపు పోలీసులు, వచ్చిన బంధుమిత్రులు ఎంత చెప్పినా వివాహం చేసుకొనేందుకు వధువు అంగీకరించలేదు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు వరుడిని తీసుకుని వెళ్లిపోయారు. వచ్చిన బంధుమిత్రులంతా ఎవరిదారిన వారు ఇంటికెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: రోజూ సందడిగా ఉండే ఇంట్లో అంతా సైలెంట్.. రాత్రి 9 గంటల సమయంలో అనుమానంతో పక్కింటి వాళ్లు వెళ్లి చూస్తే..

Updated Date - 2023-02-15T14:22:57+05:30 IST