Sudha Murty: 'ప్రధాని అత్తగారినంటే ఎవరూ నమ్మలేదు.. జోక్‌ చేస్తున్నారా? అంటూ ఎగాదిగా చూశారు!'

ABN , First Publish Date - 2023-05-16T12:52:42+05:30 IST

ప్రముఖ రచయిత్రి, సమాజ సేవకురాలు, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) ఎంత నిరాడంబరంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Sudha Murty: 'ప్రధాని అత్తగారినంటే ఎవరూ నమ్మలేదు.. జోక్‌ చేస్తున్నారా? అంటూ ఎగాదిగా చూశారు!'

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ రచయిత్రి, సమాజ సేవకురాలు, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) ఎంత నిరాడంబరంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని రిషి సునాక్‌కు సుధామూర్తి స్వయానా అత్త అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. అయినప్పటికీ సుధామూర్తి నిరాడంబరత చెక్కు చెదరలేదు. కోట్లాది రూపాయల ఆస్తులు, ఎంతో పలుకుబడి ఉన్నాసరే.. ఆమె కట్టుబొట్టూ చూస్తే సాధారణ మధ్య తరగతి మహిళలానే ఉంటారు. ఈ సింప్లిసిటీ వల్లే తనకు లండన్ వెళ్లినప్పుడు ఎదురైన ఓ అనుభవాన్ని తాజాగా ఆమె టీవీ షోలో పంచుకున్నారు. ఇటీవల ఆమె ప్రముఖ బాలీవుడ్‌ టాక్‌షో ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను సుధామూర్తి పంచుకున్నారు.

Sudhamurthy.jpg

Viral Video: వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. పెట్రోల్ ఖర్చును తగ్గించుకునేందుకు ఈ వ్యక్తి ఏం చేశాడో చూస్తే..!

ఈ షోలో ఆమె మాట్లాడుతూ.. ‘కొద్ది రోజుల క్రితం నేను బ్రిటన్ వెళ్లాను. అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు నా రెసిడెన్షియల్‌ అడ్రస్ గురించి అడిగారు. లండన్‌లో ఎక్కడ ఉంటారు? అని ప్రశ్నించారు. నాతో పాటు మా అక్క కూడా యూకే వచ్చింది. నా కుమారుడు బ్రిటన్‌లోనే ఉంటాడు. కానీ అతడి పూర్తి అడ్రసు నాకు తెలియదు. దాంతో యూకే ప్రధాని అధికారిక నివాసం, కార్యాలయం అయిన 10 డౌనింగ్ స్ట్రీట్ చిరునామా రాశాను. అంతే.. అది చూసిన ఇమ్మిగ్రేషన్ అధికారి మావైపు ఎగాదిగా చూసి.. ఎంటి జోక్‌ చేస్తున్నారా? అని అడిగారు. లేదు.. నేను నిజమే చెబుతున్నానని అన్నాను. నేను నిజమే అని చెప్పినా వారు నమ్మినట్లు నాకు అనిపించలేదు. 72 ఏళ్ల సాధారణ మహిళ అయిన నేను ప్రధానికి అత్తను అవుతానని ఆ అధికారి నమ్మలేదు’’ అని తనకు లండన్‌లో ఎదురైన వింత అనుభవం గురించి సుధామూర్తి వివరించారు.

అలాగే ఆమె తన వైవాహిక జీవితం గురించి కూడా చెప్పారు. పెళ్లి కాకముందు తన భర్త నారాయణమూర్తిని మొదటిసారి చూసిన సందర్భాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇక ఈ షోలో సుధామూర్తితో పాటు బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, ఇటీవల ఆస్కార్ గెలుచుకున్న నిర్మాత గునీత్‌ మోంగా కూడా పాల్గొన్నారు.

Viral Video: యజమాని అదే పనిగా తిడుతున్నా సైలెంట్‌గా ఉన్న శునకం.. సడన్‌గా అతడు చెప్పు తీసుకుని కొట్టబోతోంటే..!

Updated Date - 2023-05-16T12:55:02+05:30 IST