Viral Video: యజమాని అదే పనిగా తిడుతున్నా సైలెంట్‌గా ఉన్న శునకం.. సడన్‌గా అతడు చెప్పు తీసుకుని కొట్టబోతోంటే..!

ABN , First Publish Date - 2023-05-15T21:18:23+05:30 IST

యజమాని ఎన్ని తిట్టినా భరించిన కుక్క తన పిల్ల విషయంలో మాత్రం రాజీ పడలేదు. తల్లి మనసు అంటే ఏంటో కళ్లకు కట్టినట్టు చూపించిన కుక్క

Viral Video: యజమాని అదే పనిగా తిడుతున్నా సైలెంట్‌గా ఉన్న శునకం.. సడన్‌గా అతడు చెప్పు తీసుకుని కొట్టబోతోంటే..!

ఇంటర్నెట్ డెస్క్: యజమాని అదే పనిగా తనను తిడుతున్నా సైలెంట్‌గా ఉందో శునకం. కానీ అతడు చెప్పు తీసుకుని కొట్టబోయే సరికి మాత్రం దాని తీరు మారిపోయింది. తల్లి మనసు ఎలాంటిదో కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తొలుత యజమాని తన కుక్కను తిడుతున్నట్టుగా నటిస్తాడు. అచ్చం నిజమనిపించేలా అతడు యాక్షన్ చేస్తాడు. కానీ, కుక్క మాత్రం మౌనంగానే ఉంటుంది. అన్నీ భరిస్తుంది కానీ యజమానిపై మాత్రం తిరగబడదు

Shruti Haasan: శృతి మించి పోయిన శృతి.. బాబోయ్ ఈ రేంజ్‌లో గ్లామర్ ఫొటోలా..!



అయితే, తల్లి కుక్క ఎదురుగా కుక్క పిల్ల కూడా ఉంది. తల్లి కుక్కను తిట్టిన తరువాత ఆ యజమాని కుక్క పిల్లను చెప్పుతో కొట్టబోతున్నట్టు బెదిరిస్తాడు. కానీ ఆ కుక్కది కూడా తల్లి హృదయమే కదా! తన సంతానానికి ఆపద రావడం అస్సలు సహించలేకపోయింది. దీంతో, చెప్పు చూపిస్తున్న యజమానిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కాలు అడ్డం పెట్టి ఆపే ప్రయత్నం చేసింది.

ఇదంతా చూసిన నెటిజన్లు ఏ జీవిలోనైనా తల్లి మనసు ఒక్కటే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల మాతృదినోత్సవం పురస్కరించుని ఇలాంటి అనేక వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.

Eesha Rebba: బెడ్‌పై ఈషా రెబ్బా గ్లామర్ ఫొటోలు మామూలుగా లేవుగా..!


Updated Date - 2023-05-17T13:01:15+05:30 IST