Viral Video: రోడ్డుపై పడి ఉన్న పర్సును తీసుకున్న వ్యక్తి.. అందులోని డబ్బులను తీసుకోవాలని చూడగా.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN , First Publish Date - 2023-04-23T15:50:35+05:30 IST

నేటి టెక్నాలజీ యుగంలో డబ్బుల పేరుతో చాలా మంది ప్రజలను మోసం చేస్తుంటే.. ఇకొంతమంది ఫూల్స్‌ను చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ ఫన్నీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రోడ్డుపై పడి ఉన్న పర్సును తీసుకున్నాడు. అందులోని డబ్బును..

Viral Video: రోడ్డుపై పడి ఉన్న పర్సును తీసుకున్న వ్యక్తి.. అందులోని డబ్బులను తీసుకోవాలని చూడగా.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతోందనడంలో అతిశయోక్తి లేదు. డబ్బు సంపాదన కోసం కొందరు పడరాని కష్టాలు పడుతుంటారు. అయినా అంతంత ఆదాయంతోనే సరిపెట్టుకుంటుంటారు. మరికొందరు శారీరక కష్టం లేకుండా కేవలం తెలివితేటలను ఉపయోగించి లక్షలకు లక్షలు సంపాదిస్తుంటారు. ఇంకొందరికి జాక్‍‌పాట్ తగిలినట్లుగా ఉన్నట్లుండి ఊహించనంత డబ్బు వచ్చిపడుతుంటుంది. నేటి టెక్నాలజీ యుగంలో డబ్బుల పేరుతో చాలా మంది ప్రజలను మోసం చేస్తుంటే.. ఇకొంతమంది ఫూల్స్‌ను చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ ఫన్నీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రోడ్డుపై పడి ఉన్న పర్సును తీసుకున్నాడు. అందులోని డబ్బును బయటి తీయాలని చూడగా చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ హల్‌చల్ (Viral videos) చేస్తోంది. ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటాడు. కాస్త దూరం వెళ్లగానే ఎదురుగా ఓ పర్సు (wallet) పడి ఉండడాన్ని గమనిస్తాడు. అందులోని డాలర్స్ (Dollars) కూడిన నగదు ఉండడం చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతాడు. ‘‘ఆహా! ఈ రోజు నక్క తోక తొక్కి వచ్చినట్లున్నా’’.. అని అనుకుంటూ ఆనందంగా ఆ పర్సును చేతిలోకి తీసుకుంటాడు. వెంటనే అందులోని క్యాష్‌ను తీసుకోవాలని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ అవుతుంది కానీ క్యాష్ మాత్రం బయటికి రాదు.

Viral News: ప్రియుడితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ అసలు నిజం బయటపెట్టిన ప్రేయసి.. అవాక్కవుతున్న నెటిజన్లు..!

చివరకు అది పర్సు కాదు.. ఓ పేపర్ మాత్రమే అని అర్థమవుతుంది. ప్రమోషన్ కోసం కొందరు పేపర్‌పై తమ కంపెనీ పేరు, మరోవైపు పర్సు ఆకారంలో కలర్‌తో అందులోంచి నగదు బయటికి వచ్చినట్లుగా ముద్రించారు. దీంతో పైకి చూడటానికి పర్సులో నగదు ఉన్నట్లుగా కనిపిస్తుంది. చివరకు అసలు విషయం తెలుసుకున్న వ్యక్తి నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: విమానాల్లోంచి కిందకు దూకేసిన 105 మంది వృద్ధులు.. పక్కా ప్లాన్‌తో అంతా 5 విమానాల్లో వెళ్లి మరీ..!

Updated Date - 2023-04-23T15:50:35+05:30 IST