ఉద్యోగం చేస్తున్న అత్త మృతి.. తనకు ఆ జాబ్‌ను ఇప్పించాలంటూ కోర్టుకెళ్లిన కోడలు.. హైకోర్టు ఏం తేల్చిందంటే..

ABN , First Publish Date - 2023-01-05T19:02:50+05:30 IST

ఉద్యోగం చేస్తున్న కుటుంబ పెద్ద చనిపోయిన సందర్భాల్లో.. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆ ఉద్యోగం ఇవ్వడం సర్వసాధారణంగా జరిగే తంతే. తండ్రి చనిపోయిన సందర్భంలో కుమారులు, కుమార్తెలకు ఇవ్వడం, భర్త చనిపోయిన సందర్భంలో ...

ఉద్యోగం చేస్తున్న అత్త మృతి.. తనకు ఆ జాబ్‌ను ఇప్పించాలంటూ కోర్టుకెళ్లిన కోడలు.. హైకోర్టు ఏం తేల్చిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగం చేస్తున్న కుటుంబ పెద్ద చనిపోయిన సందర్భాల్లో.. కారుణ్య నియామకం కింద వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆ ఉద్యోగం ఇవ్వడం సర్వసాధారణంగా జరిగే తంతే. తండ్రి చనిపోయిన సందర్భంలో కుమారులు, కుమార్తెలకు ఇవ్వడం, భర్త చనిపోయిన సందర్భంలో ఆ ఉద్యోగాన్ని భార్యకు ఇవ్వడం తెలిసిందే. అయితే రాజస్థాన్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం చేస్తున్నఅత్త మృతి చెందింది. దీంతో ఆ జాబ్‌ను తనకు ఇప్పించాలంటూ కోడలు కోర్టుకు వెళ్లింది. దీనిపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

పురిటి నొప్పులతో ఓ మైనర్ బాలిక మృతి.. ఆసుపత్రికి వచ్చిన పోలీసులకు షాకింగ్ ట్విస్ట్.. రెండేళ్ల క్రితం నాటి కేసులో..

రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన ఓ మహిళ ప్రభుత్వ ఉద్యోగం (Govt job) చేస్తుంటుంది. ఈమె 2007లో మరణించింది. దీంతో కారుణ్య నియామకం (Compassionate appointment) కింద తనకు ఉద్యోగం ఇప్పించాలని మృతురాలి కొడుకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే దీనిపై నిర్ణయం తీసుకోకముందే 2008లో కొడుకు కూడా మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని పేర్కొంటూ.. అత్త ఉద్యోగం తనకు ఇప్పించాలని కోరుతూ కోడలు దరఖాస్తు చేసుకుంది.

గొయ్యిలో ఓ యువకుడి మృతదేహం.. అడక్కుండానే సాయం చేస్తున్న వ్యక్తిపై పోలీసులకు డౌట్.. పచ్చబొట్టుతో వీడిన మిస్టరీ..!

2009లో ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. కోడలు కారుణ్య నియామకానికి అర్హురాలు కాదంటూ తిరస్కరించింది. ఇటీవల ఇదే విషయమై ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన కోర్టు (High Court).. సంచలన నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ డిపెండెంట్ కేటగిరీ కిందకు వస్తుందని, కూతురు, కొడుకు తరహాలోనే వితంతువు అయిన కోడలు కూడా కారుణ్య నియామకానికి అర్హురాలు అని కోర్టు పేర్కొంది. కారుణ్య నియామకాన్ని పరిశీలించి, ఆమెకు రావాల్సిన అన్ని ప్రయోజనాలనూ కల్పించాలని ఆదేశించింది.

భర్తతో మాట్లాడిన తర్వాత తండ్రికి టీ ఇచ్చిన కూతురు.. కాసేపటి తర్వాత ఆమె చేసిన పనికి.. అంతా షాక్..

Updated Date - 2023-01-05T19:02:55+05:30 IST