గొయ్యిలో ఓ యువకుడి మృతదేహం.. అడక్కుండానే సాయం చేస్తున్న వ్యక్తిపై పోలీసులకు డౌట్.. పచ్చబొట్టుతో వీడిన మిస్టరీ..!

ABN , First Publish Date - 2023-01-05T16:57:28+05:30 IST

నేరస్థుల తెలివితేటల వల్ల కొన్ని కేసులు పరిష్కారమవడంలో ఆసల్యం అవుతుంటుంది. అయితే ఎంత పెండింగ్ కేసుల్లో అయినా కొన్నిసార్లు చిన్న క్లూతో నేరస్థులు దొరికిపోతుంటారు. రాజస్థాన్‌లో ఓ కేసు విషయంలో ఇలాగే జరిగింది. గొయ్యిలో..

గొయ్యిలో ఓ యువకుడి మృతదేహం.. అడక్కుండానే సాయం చేస్తున్న వ్యక్తిపై పోలీసులకు డౌట్.. పచ్చబొట్టుతో వీడిన మిస్టరీ..!

నేరస్థుల తెలివితేటల వల్ల కొన్ని కేసులు పరిష్కారమవడంలో ఆసల్యం అవుతుంటుంది. అయితే ఎంత పెండింగ్ కేసుల్లో అయినా కొన్నిసార్లు చిన్న క్లూతో నేరస్థులు దొరికిపోతుంటారు. రాజస్థాన్‌లో ఓ కేసు విషయంలో ఇలాగే జరిగింది. గొయ్యిలో పడిన మృతదేహాన్ని వెలికి తీస్తున్న పోలీసులకు.. ఓ వ్యక్తి అడక్కుండానే సాయం చేస్తున్నాడు. దీంతో వారికి అనుమానం కలిగింది. చివరకు పచ్చబొట్టు కారణంగా మిస్టరీ మొత్తం వీడిపోయిది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కార్లు, బైకులతో ప్రమాదకర స్టంట్స్.. రూ.30 చెల్లించి మరీ చావు అంచును చూసొస్తున్నారు..!

రాజస్థాన్ (Rajasthan) చిత్తోర్‌గఢ్ జిల్లా గాంగ్రార్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ 200 అడుగుల గొయ్యిలో గుర్తు తెలియని మృతదేహాన్ని (dead body) స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం తల, మొండెం వేరు చేయబడి ఉన్నాయి. అయితే మృతదేహం వెలికితీసే సమయంలో ఓ యువకుడు పిలవకుండానే పోలీసుల వద్దకు వచ్చి సాయం చేస్తున్నాడు. దీనికి తోడు అతడు అత్యుత్సాహం చూపించడంతో పాటూ అనుమానాస్పదంగా కనిపించాడు. అయినా పోలీసులు మొదట్లో పట్టించుకోలేదు. అయితే మృతుడి చేతిపై పచ్చబొట్టుతో ఏదో రాసి ఉంది. పేరు కనకడకపోవడంతో నీటితో శుభ్రం చేస్తున్నారు. కమలేష్ అని రాసి ఉన్నట్లు పోలీసులు భావిస్తుండగా.. మధ్యలో కలుగజేసుకున్న సదరు యువకుడు.. కాదు కాదు.. అది మహేంద్ర రైకా అని చెప్పాడు. దీంతో అతడిపై పోలీసులకు అప్పటిదాకా ఉన్న అనుమానం కాస్త.. మరింత బలపడింది. తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సీసీ కెమెరాలను గమనించని పోలీసులు.. నడి రోడ్డుపై కారు ఆపి మరీ ఏం చేశారంటే..

మృతుడు మహేంద్ర రైకా సోదరి తనిష్క అనే యువతికి మహవీర్‌తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అయితే వీరి ప్రేమ (love) విషయం కొన్నాళ్లు మహేంద్రకు తెలిసింది. దీంతో అతన్ని కలవొద్దంటూ సోదరికి కండీషన్ పెట్టాడు. ఈ క్రమంలో సోదరికి మరో వ్యక్తితో వివాహం (marriage) చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నాలు సాగించారు. అయితే ఎలాగైనా ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని భావించిన తనుష్క.. జరిగిన విషయాన్ని ప్రియుడికి తెలియజేసింది. తన సోదరుడిని చంపేస్తే.. ఏసమస్యా ఉండదని చెప్పడంతో మహవీర్ కూడా అంగీకరించాడు.

గ్యాంగ్ రేప్ జరిగినా కుంగిపోలేదు.. ఒకప్పుడు బార్లలో డ్యాన్సులు.. ప్రస్తుతం మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్..

తన స్నేహితులతో కలిసి మహేంద్రను హత్య చేశారు. ఈ కేసు తమ మీదకు రాకుండా ఉండేందుకు బాలీవుడ్ దృశ్యం-2 (Drishyam-2) సినిమా చూసి ప్లాన్ వేశారు. మృతదేహాన్ని గొయ్యిలో విసిరేసి, అతడి మొబైల్‌ను మరో ప్రాంతంలో విసిరేశారు. హత్య చేసిన ఐదు రోజుల తర్వాత దూరం ప్రాంతానికి వెళ్లి మృతుడి మొబైల్ ఆన్ చేసి, స్నేహితులతో మాట్లాడారు. దీంతో అతను బతికే ఉన్నాడని అంతా అనుకున్నారు. చివరకు నిందితుడి అత్యుత్సాహమే పోలీసులకు దొరికేలా చేసింది. ఈ హత్య చేసిన సమయంలో ప్రియురాలి నుంచి రూ.40వేలు తీసుకున్నట్లు విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

భర్తతో మాట్లాడిన తర్వాత తండ్రికి టీ ఇచ్చిన కూతురు.. కాసేపటి తర్వాత ఆమె చేసిన పనికి.. అంతా షాక్..

Updated Date - 2023-01-05T16:57:32+05:30 IST