Viral News: పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందో మహిళ.. సరిగ్గా 6 నెలల తర్వాత షాకింగ్ ట్విస్ట్.. టెస్టులు చేస్తే..!

ABN , First Publish Date - 2023-04-10T19:17:08+05:30 IST

కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం మరికొందరికి ప్రాణసంకటం అవుతుంటుంది. వైద్యుల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, వెలుగులోకి వచ్చిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ మహిళ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. అయితే..

Viral News: పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందో మహిళ.. సరిగ్గా 6 నెలల తర్వాత షాకింగ్ ట్విస్ట్.. టెస్టులు చేస్తే..!

కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం మరికొందరికి ప్రాణసంకటం అవుతుంటుంది. వైద్యుల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, వెలుగులోకి వచ్చిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ మహిళ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. అయితే సరిగ్గా ఆరు నెలల తర్వాత షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఉత్తరాఖండ్ హరిద్వార్ (Uttarakhand Haridwar) ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ప్రతిభాదేవి అనే మహిళకు (woman) ఆరు మంది పిల్లలు ఉన్నారు. భర్త సంపాదన అంతంతమాత్రమే కావడంతో వీరిని పోషించడమే కష్టమైంది. దీంతో దంపతులు ఇద్దరూ మాట్లాడుకుని ఇక పిల్లలు వద్దని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2019 ఫిబ్రవరిలో ప్రతిభా దేవి హరిద్వార్‌లోని జిల్లా ఆస్పత్రికి (District Hospital) వెళ్లింది. అక్కడి వైద్యులు ఆమెకు ఆపరేషన్ (Family planning operation) చేశారు. అయితే ఆపరేషన్ చేసిన కొంత కాలానికి ఆమె మళ్లీ గర్భం (pregnant woman) దాల్చింది. పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకంటే మళ్లీ గర్భం దాల్చడం ఏంటని దంపతులు ఖంగుతిన్నారు.

Crime News: రెండేళ్ల కూతురు, పక్కింటి యువకుడితో ఫొటో దిగి.. ఏడుస్తున్న ఎమోజీని పెట్టి వాట్సప్ స్టేటస్‌గా పెట్టిన భార్య.. భర్తకు నిజం తెలిసి..

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఆరోపిస్తూ.. ఈ దంపతులు చివరకు మహిళా జిల్లా వినియోగదారుల కమిషన్‌ను (Womens District Consumer Commission) ఆశ్రయించారు. ఆరుగురు పిల్లలను పెంచడమే కష్టమైందని, ఇప్పుడు ఏడో సంతానాన్ని పోషించడం తమ వల్ల కాదని వాపోయారు. ఆ బిడ్డను పెంచడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని కోరాడు. దీనిపై ఇటీవల రాష్ట్ర కమిషన్ (State Commission) విచారణ చేపట్టింది. ఏప్రిల్ 28న కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో చివరకు బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతందో వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tea: టీ తాగిన వెంటనే చనిపోయాడో వ్యక్తి.. అతడి ఫోన్‌లోని వీడియోలను చూసి డెత్ మిస్టరీని బయటపెట్టిన పోలీసులు.. ఇంతకీ అసలు కథేంటంటే..!

Updated Date - 2023-04-10T19:17:08+05:30 IST