Viral Video: పోట్లాడుకుంటూ.. అంతా చూస్తుండగా.. ఆటోలోకి దూరిన ఎద్దు.. చివరికి ఏం జరిగిందో చూడండి..

ABN , First Publish Date - 2023-04-09T21:48:23+05:30 IST

మారుమూల ప్రాంతాల్లో చోటు చేసుకునే చిన్న చిన్న సంఘటనలు సైతం చిటికెలో ప్రపంచం మొత్తం చుట్టేస్తుంటాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉండడంతో కళ్ల ముందు ఎలాంటి విచిత్ర ఘటన జరిగినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసేస్తుంటారు. వీటిలో..

Viral Video: పోట్లాడుకుంటూ.. అంతా చూస్తుండగా.. ఆటోలోకి దూరిన ఎద్దు.. చివరికి ఏం జరిగిందో చూడండి..

మారుమూల ప్రాంతాల్లో చోటు చేసుకునే చిన్న చిన్న సంఘటనలు సైతం చిటికెలో ప్రపంచం మొత్తం చుట్టేస్తుంటాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉండడంతో కళ్ల ముందు ఎలాంటి విచిత్ర ఘటన జరిగినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసేస్తుంటారు. వీటిలో వినూత్నంగా ఉండే ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఎద్దుల పోట్లాటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది. రెండు ఎద్దుల మధ్య అంతా చూస్తుండగా పోట్లాట మొదలవుతుంది. ఈ క్రమంలో ఓ ఎద్దు నేరుగా ఆటోలోకి దూరుతుంది. దీంతో చివరకు ఏం జరుగుతుందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (viral videos) అవుతోంది. రెండు ఎద్దుల మధ్య భీకర పోట్లాట (Bullfight) మొదలవుతుంది. ఒకదానికొకటి కొమ్ములతో పొడుచుకుంటూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తాయి. ఎద్దుల పోట్లాటతో అక్కడున్న వారంతా దూరంగా పరుగులు పెడతారు. పోట్లాడుకునే క్రమంలో ఓ ఎద్దు సడన్‌గా ఓ ఆటోలోకి దూరుతుంది. అయినా రెండింటి మధ్య పోట్లాట మాత్రం ఆగదు. ఆటో స్టీరింగ్ మధ్యలో దూరిన ఎద్దు.. బయట ఉన్న మరో ఎద్దు పోట్లాడుకుంటూ ఆటోనూ (auto) కూడా ఈడ్చుకుంటూ వెళ్తాయి.

Viral Video: నడి రోడ్డుపై యువతిని వెంటపడిన వ్యక్తి.. పదే పదే బలవంతం చేస్తుండగా.. చివర్లో సడన్‌గా ఏం జరిగిందంటే..

కొంత దూరం ఈడ్చుకెళ్లిన తర్వాత ఎట్టకేలకు ఎద్దు ఆటో నుంచి బయటికి వస్తుంది. సినిమా షూటింగ్‪‌కి ప్యాకప్ చెప్పినట్లుగా.. మా గొడవ అయిపోయింది అన్నట్లుగా అక్కడి నుంచి కామ్‌గా వెళ్లిపోతాయి. అప్పటి వరకూ సీరియస్‌గా పోట్లాడుకున్న ఎద్దులు.. ఒక్కసారిగా సైలెంట్ అవ్వడం చూసి అంతా అవాక్కవుతారు. ఆ సమయలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చివరికి రెండు ఎద్దులూ కలిసి ఆటోను చిత్తుచిత్తు చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు (Funny comments) పెడుతున్నారు.

Funny video: మీ ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందా.. అయితే ఇంటి నుంచి ఇలా ఈజీగా వెళ్లగొట్టండి..

Updated Date - 2023-04-09T21:54:25+05:30 IST