Karnataka Polls Live Updates : కన్నడనాట వార్ వన్‌సైడ్ అంటున్న ఎగ్జిట్‌పోల్స్

ABN , First Publish Date - 2023-05-10T08:42:49+05:30 IST

కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగనుంది.

Karnataka Polls Live Updates : కన్నడనాట వార్ వన్‌సైడ్ అంటున్న ఎగ్జిట్‌పోల్స్

06:35 pm : ఎగ్జిట్స్ పోల్స్ వచ్చేశాయ్..

అటు కన్నడనాట ఎన్నికల పోలింగ్ ముగియగానే.. ఇటు ఎగ్జిట్స్ పోల్స్ వచ్చేశాయి.

పీపుల్స్‌పల్స్ :-

కాంగ్రెస్ : 107-119

బీజేపీ : 78-90

జేడీఎస్ : 23-29

ఇతరులు : 1-3

రిపబ్లిక్ టీవీ :-

కాంగ్రెస్ : 94-108

బీజేపీ : 85-100

జేడీఎస్ : 24-32

ఇతరులు : 2-6

06:10 pm : కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

  • ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే రోజులు ఇవి కావు : జేడీసీ నేత, మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి

  • డబ్బులు లేకుండా ఎవరూ ఎన్నికలను ఎదుర్కోలేరు

  • జేడీఎస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఓ ప్ర్యతేక ఇంటర్వ్యూలో ధీమా

  • ఈ ఎన్నికల్లో జేడీఎస్ కింగ్‌గా నిలుస్తుందా? కింగ్ మేకర్‌గా నిలుస్తుందా? అనే ప్రశ్నకు ప్రజలే నిర్ణయిస్తారన్న కుమారస్వామి

KUMARASWAMY.jpg

06:00 pm : ముగిసిన కర్ణాటక ఎన్నికల పోలింగ్

  • సాయంత్రం ఆరు గంటలకు ముగిసిన ఎన్నికల పోలింగ్

  • క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటేసే అవకాశం

  • సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ నమోదు

  • 2018లో 72.13 శాతం పోలింగ్ నమోదు

  • చివరి దశలో రికార్డయ్యే పోలింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ

05:35 pm : అరుదైన ఘటన

  • పోలింగ్‌ బూత్‌ వద్దే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

  • బల్లారిలోని కుర్లగిండి గ్రామంలో ఘటన

  • పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలైన్లో ఉన్న సమయంలో పురిటినొప్పులు

  • మహిళా ఓటర్లు, సిబ్బంది సాయంతో ప్రసవం

  • తల్లీ, బిడ్డను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించిన అధికారులు, కుటుంబ సభ్యులు

  • ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటన

05:28 pm : ఇంకో అరగంట మాత్రమే..

  • కర్ణాటకలో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్

  • సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ నమోదు

  • 6 గంటల వరకూ కొనసాగనున్న పోలింగ్

  • ఇంకో అరగంట మాత్రమే ఉండటంతో పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు

  • క్యూ లైన్‌లో ఉండే ఓటర్లకు 6 గంటల తర్వాత కూడా అవకాశం ఉంటుందన్న అధికారులు

Voters.jpg

04:03 PM: 3 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు

Untitled-12.jpg

చెదురుమదురు ఘటనలు మినహా కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 3 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు నమోదయినట్టు తెలుస్తోంది. విజయ్‌పుర జిల్లాలోని మసబినాల్‌ గ్రామస్థులు కొన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు, వీవీప్యాట్లను ధ్వంసం చేశారు. పోలింగ్ ఆఫీస్ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. అధికారులు ఈవీఎంలు, వీవీప్యాట్లను మార్చుతున్నారనే వదంతులు వ్యాపించడం ఈ పరిస్థితికి దారితీసింది.

03:41 PM: ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడంటే...

కర్ణాటక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ముగింపు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పోలింగ్ బూత్‌లకు చేరుతున్న ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. కాగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వివిధ సర్వే సంస్థలు, ఏజెన్సీలు ప్రకటించనున్నాయి. ఈ జాబితాలో సీవోటర్, లోక్‌నీతి-సీడీఎస్, యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెలువరిస్తాయనే అంచనాలున్నాయి. ఇక వేర్వురు ఛానల్స్ కూడా తమ పోల్స్‌ను ప్రజెంట్ చేయనున్నాయి.

03:41 PM: కర్ణాటక పోలింగ్ మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంది. 3 గంటల సమయానికి 52.03 శాతంగా నమోదయ్యింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక డేటా విడుదల చేసింది.

Untitled-9.jpg

3:30 PM : ఓటు వేసిన కొద్ది క్షణాల్లో గుండెపోటు, వ్యక్తి మృతి

హసన్ జిల్లా, బేలూర్ తాలూకా, చికోలే గ్రామంలో ఓటు వేసిన జయన్న (49) పోలింగ్ బూత్‌లోనే కుప్పకూలిపోయారు. ఆయన చాలాసేపు ఓటర్లతోపాటు వరుసలో నిల్చున్నారు. ఓటు వేసి, బయటకు వస్తుండగా ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.

3:25 PM : కేంద్ర మంత్రి సోనోవాల్ వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, కర్ణాటకలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

02:45 PM : భారతీయుడిగా వచ్చా : కిచ్చా సుదీప్

Untitled-10.jpg

ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రతి వ్యక్తికి సమస్యలు ఉంటాయని, ఓటర్లు తమ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తాను ఓ సెలబ్రిటీగా ఇక్కడికి రాలేదని, ఓ భారతీయుడిగా వచ్చానని తెలిపారు. ఓటు వేయడం తన బాధ్యత అని చెప్పారు. ఆయన బీజేపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

02:22 PM: జోరందుకున్న పోలింగ్

కర్ణాటక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి మందకొడిగా కొనసాగిన పోలింగ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. క్యూలైన్లలో జనాలు కనిపిస్తున్నారు.

02:10 PM: భారత మాజీ ప్రధాని దేవెగౌడ కర్ణాటక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధాప్యంలో నడవలేని స్థితిలో ఉన్న దేవెగౌడను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది చేతులతో పట్టుకొని బూత్‌లోకి తీసుకెళ్లి ఓటు వేయించారు. ఆయనతోపాటు సతీమణి కూడా పోలింగ్ బూత్‌కి వచ్చి ఓటు వేశారు.

Untitled-8.jpg

01:48 PM: కర్ణాటకలో అధికారంపై యడియూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు

ఓటింగ్ కొనసాగుతున్న వేళ బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఏ పార్టీ మద్ధతు తమకు అవసరంలేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకున్నారన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రచారానికి వచ్చారని గుర్తుచేశారు. కచ్చితమైన మెజారిటీ సాధించేందుకు ఇవన్నీ ఉపయోగపడతాయని, 101 శాతం బీజేపీ అధికారారిన్ని సాధిస్తుందని పేర్కొన్నారు.

01:21 PM: కర్ణాటక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బూత్‌ క్యూ లైన్లలో ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ 37.25 శాతంగా నమోదయ్యింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక సమాచారాన్ని విడుదల చేసింది.

Untitled-4.jpg

01:02 PM: కన్నడ నటుడు శివ రాజ్ కుమార్, ఆయన సతీమణి, జేడీఎస్ లీడర్ గీత శివరాజ్ కుమార్ ఓటు వేశారు.

Untitled-3.jpg

12:38 PM: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు...

Untitled-2.jpg

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక ఎన్నికల్లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. 130 - 135 సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా మల్లికార్జున ఖర్గేతోపాటు ఆయన సతీమణి కూడా కలబురగిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

12:15 PM: కన్నడనాట పోలింగ్‌లో పెళ్లి పీటల మీద నుంచి వచ్చి ఓటు వేస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. మైసూరులోని ఓ పోలింగ్ బూత్‌లో పెళ్లికూతురు, పెళ్లికొడుకు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి జరుగుతున్నప్పటికీ బాధ్యతాయుతంగా వచ్చి ఓటు వేయడంపట్ల వారికి అభినందనలు వెల్లువెత్తున్నాయి.

Untitled-251.jpg

11:58 AM: పోలింగ్ జరుగుతుండగా డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

Untitled-22.jpg

కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అనంతరం మీడియా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత కూడా జేడీఎస్‌తో పొత్తు ఉండబోదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితికి వచ్చే అవకాశం ఉండదని, కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దీమా వ్యక్తం చేశారు. మరోవైపు హెచ్‌డీ కుమారస్వామి కూడా ఇదే దీమాతో ఉన్నారు. జేడీఎస్ కింగ్ మేకర్ కాదు.. కింగ్ అవుతుందని వ్యాఖ్యానించారు. జేడీఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆయన కోరారు.

11:45 AM: ఉదయం 11 గంటల సమయానికి పోలింగ్ 20.94 శాతంగా నమోదయ్యింది.

11:35 AM: ఓటేసిన నటుడు ఉపేంద్ర

Untitled-20.jpg

దిగ్గజ నటుడు ఉపేంద్ర ఓటేశాడు. బెంగళూరులోని ఓ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. కాగా ఇప్పటివరకు ఓటు వేసిన ప్రముఖుల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, నటుడు ప్రకాశ్ రాజ్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దంపతులతోపాటు క్రికెటర్ జవగల్ శ్రీనాథ్, కర్ణాకట చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మనోజ్ కుమార్ మీనా ఉన్నారు.

11:24 AM: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ చీఫ్ కుమారస్వామి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామనగరలో కుమారుడితో కలిసి ఆయన ఓటు వేశారు.

Untitled-19.jpg

11:12 AM: ఓటేసిన కాంగ్రెస్ సీనియర్ సిద్ధరామయ్య.. మీడియాతో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Untitled-16.jpg

కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధారామయ్య ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ 130కిపైగా సీట్లు గెలుచుకుంటుందని చెబుతూ వస్తున్నాను. ఈ సంఖ్య 150 వరకు కూడా వెళ్లవచ్చు. మే 13న ప్రకటించే ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా మెజారిటీ సాధిస్తుంది. పనిచేసే పార్టీకి ప్రజలు ఓటు వేయాలి. దేశ భవిష్యత్‌ కూడా ఈ ఎన్నికతో ముడిపడి ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

11:00 AM: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, హుబ్లీ-ధర్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జగదీష్ షెట్టర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడంపై ఆయన స్పందించారు. ‘ఇది చర్చించాల్సిన ప్రశ్న కాదు. రాజ్యాంగ విరుద్ధంగా ఏ సంస్థపైనైనా నిషేధం విధించడంపై ఇప్పటికే చాలా సందర్భాల్లో మాట్లాడాను. సంస్థలపై నిషేధం విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం ఉండదు’’ అని క్లారిటీ ఇచ్చారు.

Untitled-14.jpg

10:45 AM: సీఎం బసవరాజ్ బొమ్మై, ఆయన కూతురు అదితి, కొడుకు భరత్ బొమ్మై ముగ్గురూ హవేరి జిల్లాలో తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఒక గవర్నమెంట్ స్కూల్లో ఓటు వేశారు.

Untitled-10.jpg

10:30 AM: పోలింగ్ జరుగుతుండగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు....

Untitled-13.jpg

కర్ణాటక పోలింగ్ కొనసాగుతుండగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ 40 శాతం కమిషన్ రహిత’, ‘ప్రగతిశీల కర్ణాటక’ను ఏర్పాటు చేయాలంటే కర్ణాటక ఓటర్లను ఆయన కోరారు. పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన హిందీ ట్వీట్ చేశారు. మహిళా హక్కులు, యువతకు ఉపాధి, పేదలకు అండ విషయంలో హామీలను కచ్చితంగా నెరవేస్తామని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ విన్నింగ్ 150’ హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేశారు.

10:10 AM: చిక్కమగళూరు జిల్లా ముడిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని మకొనహల్లిలో ఓ పెళ్లి కూతురు ఓటుహక్కు వినియోగించుకుంది. పోలింగ్ బూత్ నంబర్ 165 ఆమె ఓటు వేసింది.

Untitled-11.jpg

09:56 AM: ఓటేసిన పెళ్లికూతురు..

Untitled-9.jpg

కర్ణాటక ఎన్నికల్లో ఓ యువతిపెళ్లి డ్రెస్‌లో తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఉడిపి జిల్లా కాపు నియోజకవర్గంలో ఆమె తన ఓటును ఉపయోగించుకుంది. కాగా పెళ్లి దుస్తుల్లో యువతి ఓటు వేయడంతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

09:40 AM: ఉదయం 9:30 గంటలకు పోలింగ్ శాతం ఎంతంటే...

Untitled-8.jpg

కర్ణాటక ఎన్నికల పోలింగ్ ఉదయం 9:30 గంటల సమయానికి 8:02 శాతంగా నమోదయ్యింది. ఈ మేరకు ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది.

09:25 AM: పోలింగ్ జరుగుతుండగా ప్రధాని మోడీ కీలక ట్వీట్

Untitled-7.jpg

కర్ణాటకలో పోలింగ్ జరుగుతుండగా ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు కీలక సందేశం ఇచ్చారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని కర్ణాటక ప్రజలను ఆయన కోరారు. ముఖ్యంగా యువత, తొలిసారి ఓటు వేసేవారు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

09:10 AM: ఓటేసిన నారాయణమూర్తి దంపతులు... యువ ఓటర్లకు కీలక సందేశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఇన్పోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ‘‘దయచేసి మమ్మల్ని చూసి నేర్చుకోండి’’ అని సుధామూర్తి ఈ సందర్భంగా యువ ఓటర్లను కోరారు. ‘‘దయచేసి మమ్మల్ని చూడండి. మేము పెద్దవాళ్లం, కానీ మేం 6 గంటలకు లేచి ఇక్కడకు వచ్చి ఓటు వేశాం. దయచేసి మా నుంచి నేర్చుకోండి. ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో పవిత్ర భాగం’’ అని సుధామూర్తి అన్నారు.

Untitled-6.jpg

09:00 AM: ఎమ్మెల్సీ కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్

Untitled-5.jpg

కర్ణాటక ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘డియర్ కర్ణాటక.. విద్వేషాన్ని తిరస్కరించు’’ అంటూ ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలతోపాటు సమాజాభివృద్ధి, శ్రేయస్సు, సంక్షేమానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

8:50 AM: ఓటేసిన మాజీ సీఎం యడియూరప్ప.. ఆసక్తికర వ్యాఖ్యలు..

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కొడుకు విజయేంద్ర 40 వేల మెజారిటీతో గెలవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. నిస్సందేహంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు.

Untitled-4.jpg

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కొడుకు విజయేంద్ర 40 వేల మెజారిటీతో గెలవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. నిస్సందేహంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

8:45 AM: మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు.

Untitled-3.jpg

8:30 AM: పోలింగ్ కొనసాగుతున్న వేళ సీఎం బొమ్మై.. హుళ్లీలోని ఓ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. సిగ్గాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయనను ఆలయ పండితులు ఆశీర్వదించారు.

Untitled-2.jpg

8:20 AM: కర్ణాటకలో పోలింగ్ సందడి కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు.

8:00 AM: కర్ణాటకలో బుధవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 224 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు వరకు జరుగుతుంది. 2,615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 2,430 మంది పురుషులు, 184 మంది మహిళలు. ఒకరు ట్రాన్స్‌జెండర్‌. రాష్ట్రంలో మొత్తం 5,31,33,054 మంది అర్హులైన ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులే (2,67,28,053) అధికం. మహిళా ఓటర్ల సంఖ్య 2,64,00,074 కాగా.. ఇతరులు 4,927 మంది. 11,71,558 మంది యువత తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. దివ్యాంగ ఓటర్ల సంఖ్య 5,71,281. 80 ఏళ్లకుపైబడిన వృద్ధ ఓటర్లు 12,15,920 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 4 లక్షల మంది సిబ్బంది పోలింగ్‌ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. 75,603 బ్యాలెట్‌ యూనిట్లు(బీయూ), 70,300 కంట్రోల్‌ యూనిట్లు(సీయూ), 76,202 వీవీప్యాట్లు వినియోగించనున్నారు. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1.56 లక్షల మంది పోలీసులను బందోబస్తులో పాల్గొంటున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమందిని ఎన్నికల భద్రతకు కేటాయించడం ఇదే తొలిసారి.

ఇంకోవైపు.. పాలక బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌, జేడీఎస్‌ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగించాయి. పలు చిన్న పార్టీలు బరిలో ఉన్నప్పటికీ ఈ మూడు పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ మొత్తం 224 స్థానాలకు, కాంగ్రెస్‌ 223, జేడీఎస్‌ 207 చోట్ల అభ్యర్థులను నిలిపాయి. 1985 నుంచి 38 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ ఆనవాయితీని బద్దలు కొట్టి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భారీఎత్తున ప్రచారం నిర్వహించింది. అటు కాంగ్రెస్‌ కూడా ప్రచారాన్ని హోరెత్తించింది. ఇక రాష్ట్రంలో హంగ్‌ సభ ఖాయమని.. 35-40 స్థానాలు సాధించి మళ్లీ ‘కింగ్‌మేకర్‌’ అవ్వాలని జేడీఎస్‌ తహతహలాడుతోంది. కాగా, కర్ణాటక శాసనసభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా రూ.379.36 కోట్ల విలువైన నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.

Updated Date - 2023-05-10T18:41:47+05:30 IST